Assam CM to Basara: నేడు బాసరకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాక.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం
Assam CM to Basara: బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బాసరలో అస్సోం సిఎం హిమంతుHimanta Biswasaramaబిశ్వశర్మ, నారాయణపేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిKisahan Reddy యాత్రల్ని ప్రారంభిస్తారు.
Assam CM to Basara: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి సమర శంఖారావం పూరించనుంది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ ఎన్నికల బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు క్షేత్రస్థాయిలో శ్రేణులను ఏకధాటిపై తేవడం కోసం, పార్టీ విధివిధానాలను, తమ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను మంగళవారం బాసర పుణ్యక్షేత్రం నుండి ప్రారంభిస్తున్నారు.
అదిలాబాద్ పెద్దపెల్లి నిజాంబాద్ పార్లమెంటు స్థానాలను అనుసంధానిస్తూ 21 శాసనసభ స్థానాల్లో సుమారు 310 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి అశోక్ ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఉదయం 9 గంటలకు బాసర సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడనుండి నేరుగా భైంసాకు చేరుకుంటారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరుకానున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం యాత్ర మొదలవుతుంది.
కల్లూరులో, నర్సాపూర్ (జి), దిలావర్పూర్ రోడోషో ముగించుకున్న అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అక్కడ బహిరంగసభ జరుగు తుంది. రాత్రి అక్కడే బసచేస్తారు.
నారాయణ పేటలో కిషన్ రెడ్డి
నారాయణపేట జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు నారాయణ పేట జిల్లా కృష్ణ నదిలో పూజలు నిర్వహిస్తారు.
అనంతరం కృష్ణ గ్రామంలో విజయసంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. ఉదయం10 గంటలకు మాగునుర్ మండలం మీదుగా మక్తల్ టౌన్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఉట్కూరు మండలంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం సింగారం గేట్ మీదుగా రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. చేనేత కార్మికులతో ముఖాముఖీలో పాల్గొంటారు. మంగళవారం రాత్రి నారాయణ పేటలోనే బస చేస్తారు.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.