Army Public School : గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే-army public school golconda recruitment 2023 of teaching and non teaching jobs notification ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Army Public School : గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే

Army Public School : గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 27, 2023 11:38 AM IST

Army Public School Golconda : టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఉద్యోగాలు
గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఉద్యోగాలు

Army Public School Golconda Jobs 2023: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా అర్హతలను వెల్లడించింది. దరఖాస్తు ఫారమ్ ను ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టీజీటీ 5, పీజీటీలు రెండు ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ తో పాటు మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి…

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ సంస్థ - గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌

మొత్తం ఉద్యోగాలు - 18

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 02 పోస్టులు (ఇంగ్లీష్, జియోగ్రఫీ)

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 05 పోస్టులు (ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్)

ప్రైమరీ టీచర్ (పీఆర్టీ) - 02 పోస్టులు ఉన్నాయి.

అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): 01 పోస్టులు ( ఈ పోస్టుకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంకులో జేసీవో క్లర్క్ స్థాయి వరకు ఉండాలి. కంప్యూటర్, అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి)

లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ): 01 పోస్టులు (ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంకులో హవాల్దార్ క్లర్క్ స్థాయి వరకు ఉండాలి)

కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌: 01 పోస్టులు (ఇంటర్ అర్హత ఉండాలి. ఏడాది డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) కోర్సుతోపాటు హార్డ్‌వేర్ నాలెడ్జ్ ఉండాలి)

సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌: 03 పోస్టులు. ఇంటర్(సైన్స్) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

మల్టీటాస్కింగ్ స్టాఫ్: 02 పోస్టులు (పదోతరగతి అర్హతతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి)

గార్డెనర్: 01 పోస్టులు (పదోతరగతి అర్హతతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి)

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

దరఖాస్తు రుసుం- రూ.100

ఎంపిక విధానం - అనుభవం ఆధారంగా నియామకాలు జరుపుతారు.

దరఖాస్తులు ఫారమ్ - https://www.apsgolconda.edu.in/forms.html లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.

అధికారిక వెబ్ సైట్ - https://www.apsgolconda.edu

దరఖాస్తు చివరితేది- అక్టోబర్ 10, 2023

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా చిరునామా: Army Public School Golconda, Hydersha kote, Near Suncity, Hyderabad-500031.

Whats_app_banner