Nehru Zoo Park : హైదరాబాద్‌ జూ పార్క్ లో విషాదం.. ఏనుగు దాడిలో యానిమల్‌ కీపర్‌ మృతి-animal keeper killed in elephant attack at nehru zoo park in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nehru Zoo Park : హైదరాబాద్‌ జూ పార్క్ లో విషాదం.. ఏనుగు దాడిలో యానిమల్‌ కీపర్‌ మృతి

Nehru Zoo Park : హైదరాబాద్‌ జూ పార్క్ లో విషాదం.. ఏనుగు దాడిలో యానిమల్‌ కీపర్‌ మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 08, 2023 06:38 AM IST

Nehru Zoo Park in Hyderabad:నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ లో విషాద ఘటన వెలుగు చూసింది. ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షుడు ప్రాణాలు కోల్పోయాడు.

యానిమల్‌ కీపర్‌ మృతి
యానిమల్‌ కీపర్‌ మృతి

Nehru Zoo Park in Hyderabad: ఏనుగు దాడిలో యానిమల్‌ కీపర్‌ మృతి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాైద ఘటన హైదరాబాద్ జూపార్క్ లో వెలుగు చూసింది. 22 ఏళ్ల షాబాజ్ మృతి చెందాడు. ఈ ఘటన పట్ల జూపార్క్ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

yearly horoscope entry point

వివరాల్లోకి వెళ్తే….. హైదరాబాద్ జూపార్కు ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఉత్సవాల్లో షాబాజ్‌ పాల్గొన్నారు. తర్వాత తన విధులు ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఏనుగులు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మగ ఏనుగు షాబాజ్‌పై దాడి చేసింది. తొండంతో లాక్కొని విసిరి కొట్టింది. ఇతర సంరక్షకులు అక్కడికి వెళ్లి చూడగా… షాబాజ్ లేవలేనిస్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతడ్ని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటన జూ సిబ్బంది తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. జూలో పనిచేసే షాబాజ్‌ తండ్రి మూడేళ్ల క్రితం మరణించడంతో… కారుణ్య నియామకం కింద షాబాజ్ కు ఉద్యోగం దక్కినట్లు అధికారులు పేర్కొన్నారు. జూ పార్క్ చరిత్రలో జంతువుల దాడిలో వ్యక్తి చనిపోవటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

Whats_app_banner