AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే-aiims bibinagar invites applications from eligible candidates for 40 posts of senior residents ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aiims Bibinagar Recruitment : ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 13, 2023 02:44 PM IST

AIIMS Bibinagar Recruitment 2023: బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. జూనియర్ రెసిడెంట్(నాన్‌-అకడమిక్‌) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు వివరాలను తెలిపింది.

బీబీనగర్ లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.
బీబీనగర్ లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.

AIIMS Bibinagar Recruitment 2023: హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. నాన్ - అకడమిక్ కోటాలోని జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్య వివరాలు:

భర్తీ చేసే సంస్థ - ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(బీబీనగర్‌)

ఉద్యోగాలు - జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌)

మొత్తం ఖాళీలు - 40 పోస్టులు

అర్హత - ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు - 37 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు - జనరల్‌ అభ్యర్థులు రూ.1180, ఈడబ్ల్యూఎస్‌ రూ.944, చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ - 19-12-2023.

మెయిల్ - recruitment.aiimsbibinagar@gmail.com

అధికారిక వెబ్ సైట్ - https://aiimsbibinagar.edu.in

IPL_Entry_Point