Texas Gun Firing : అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం-a telangana girl died in a shooting at a shopping mall in america ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Texas Gun Firing : అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం

Texas Gun Firing : అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం

HT Telugu Desk HT Telugu
May 08, 2023 01:42 PM IST

Texas Gun Firing: అమెరికాలో ఆదివారం జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన 27ఏళ్ల యువతి దుర్మరణం పాలైంది. ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఐశ్వర్య, టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది.

టెక్సాస్‌లో ప్రాణాలు కోల్పోయిన తాటికొండ ఐశ్వర్య
టెక్సాస్‌లో ప్రాణాలు కోల్పోయిన తాటికొండ ఐశ్వర్య

Texas Gun Firing: అమెరికాలో జరిగిన తుపాకీ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. అగంతకుడి కాల్పుల్లో గాయపడిన తాటికొండ ఐశ్వర్య అనే యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం టెక్సాస్‌లోని ఓ మాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. మాల్‌లో ఉన్న వారిపై విచక్షణా రహితంగా నిందితుడు కాల్పులకు పాల్పడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

టెక్సాస్‌లో చనిపోయిన ఐశ్వర్యను రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ నర్సిరెడ్డి కుమార్తెగా గుర్తించారు. టెక్సాస్‌ మాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడటంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఐశ్వర్య తీవ్రంగా గాయపడింది.

డల్లాస్-ఏరియా మాల్‌లో తొమ్మిది మందిని హతమార్చిన దుండగుడు జాత్యంహకారంతోనే కాల్పులకు దిగినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడటానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

నిందితుడు మౌరిసియో గార్సియా , ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాలను ఫెడరల్ పోలీసులు సమీక్షిస్తున్నారు. శ్వేత జాతీయుల ఆధిపత్యం, నాజీల భావజాలంపై ఆసక్తిని చూపిస్తూ గతంలో చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లను గుర్తించారు. మాల్‌లో కాల్పలకు పాల్పడిన మౌరిసియోను పోలీసులు కాల్చి చంపారు. నిందితుడి శరీరంపై పలు గుర్తులను పోలీసులు కనుగొన్నారు. .

మితవాద తీవ్రవాదులు, శ్వేతజాతి ఆధిపత్య సమూహాలలో ప్రసిద్ధి చెందిన "రైట్ వింగ్ డెత్ స్క్వాడ్" పదానికి సంక్షిప్త రూపమైన "RWDS" అని రాసి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు కాల్పులు జరిపినప్పడుు గార్సియా ఛాతీపై ఒక పాచ్ కూడా ఉందని పోలీసులు ప్రకటించారు. నిందితుడికి అతివాద బృందాలతొో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

2023లో ఐదు నెలల వ్యవధిలో దాదాపు 198 తుపాకీ కాల్పుల ఘటనలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. వీటిలో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Whats_app_banner