Hyderabad Crime News : సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఎర..! ఇంటర్వూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..!-a software manager attempted to rape a young woman who came for an interview in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime News : సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఎర..! ఇంటర్వూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..!

Hyderabad Crime News : సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఎర..! ఇంటర్వూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..!

HT Telugu Desk HT Telugu

Hyderabad Crime News : హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది. ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ యువతిపై సాఫ్ట్ వేర్ సంస్థ మేనేజర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. యువతి ఫిర్యాదు మేరకు మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇంటర్వ్యూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారయత్నం

Hyderabad News : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.ఉద్యోగం పేరుతో ఓ యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థ మేనేజర్. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ మధురా నగర్ లో టెక్ ఫ్లో అనే సాఫ్ట్ వేర్ సంస్థ లో ఉద్యోగం ఖాళీ ఉండడంతో ఓ యువతి అప్లికేషన్ చేసుకుంది.

ఆ తర్వాత సదరు యువతికి ఇంటర్హ్యూ కాల్ వచ్చింది. దీంతో ఆ యువతి మధురా నగర్ లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఆమెను మేనేజర్ నవీన్ కుమార్ ఉద్యోగానికి ఎంపిక అయ్యావని చెప్పాడు. జాయిన్ కావాలంటే వ్యక్తిగత సిమ్ కార్డు కాకుండా ఆఫీస్ సిమ్ కార్డ్ అవసరమని చెప్పాడు.

ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ యువతికి మేనేజర్ పై ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో ఆమె సరే అంది. కాగా ఈ నేపథ్యంలోనే తనకు మాయ మాటలు చెప్పిన మేనేజర్ నవీన్ కుమార్.....తాను ప్రస్తుతం బిజీగా ఉన్నని రేపు తన నివాసానికి రావాలని కోరాడు. నవీన్ కుమార్ మాయ మాటలు నమ్మిన యువతి అందుకు ఒప్పుకుంది.

ఇంటికి పిలిపించి......

ఆఫీస్ సిమ్ కార్డ్ సాకుతో యువతిని తన ఇంటికి పిలిపించుకున్నాడు మేనేజర్ నవీన్ కుమార్. ఆమె లోపలకి రాగానే డోర్ లాక్ చేసి యువతి పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో యువతి కేకలు వేయడంతో చంపుతానని బెదరించాడు. యువతి నవీన్ కుమార్ నుంచి చాకచక్యంగా తప్పించుకొని బయటపడింది.

అక్కడి నుంచి నేరుగా మధురా నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మేనేజర్ నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుడు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అయితే ఇది వరకు కూడా మేనేజర్ నవీన్ కుమార్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు విచారణలో తేలింది.నిరుద్యోగ యువత ముఖ్యంగా మహిళలు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

వ్యభిచారం చేయిస్తున్న కసాయి తల్లి.....

కుమార్తెలా పెంచాల్సిన దత్తత కూతురిని తల్లే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. యూసఫ్ గూడ లోని కృష్ణ నగర్ లో నివాసం ఉండే లక్ష్మి,ఆమె భర్త కొన్నేళ్ల క్రితం ఒక పాపను దత్తత తీసుకున్నారు.

పాపకు ఇప్పుడు 14 ఏళ్ళ వచ్చాయి. అయితే దత్తత తీసుకున్న తల్లి లక్ష్మి బాలికను గత రెండేళ్లుగా తాడుతో కట్టి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది. తల్లి దారుణాలను భరించలేక ఆ బాలిక జూబ్లి హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు… తల్లి లక్ష్మి పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా