US Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడి మృతి
US Accident: అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.
US Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌కు చెందిన ముక్కర భూపాల్‌రెడ్డి కుమారుడు సాయి రాజీవ్‌రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయి రాజీవ్‌రెడ్డి పార్సిల్ తీసుకోవడానికి ఇంటి నుంచి తన కారులో విమానాశ్రయానికి వెళ్లారు. పార్సిల్ తీసుకుని తిరిగి వస్తుండగా ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
సాయి రాజేష్ మృతి చెందిన విషయం ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖమ్మంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తండ్రి భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా ప్రయాణమయ్యారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి వివాహం జరిగింది. మృతుని సోదరి శిల్పారెడ్డి కూడా టెక్సాస్‌లోనే నివాసం ఉంటున్నారు.మృతుని తండ్రి ఖమ్మం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు.