Nizamabad District : ఆర్మూరులో BRSకు బీటలు... కాంగ్రెస్ లో చేరిన 17 మంది కౌన్సిల‌ర్లు-17 brs councilors joined congress in armoor municipality ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad District : ఆర్మూరులో Brsకు బీటలు... కాంగ్రెస్ లో చేరిన 17 మంది కౌన్సిల‌ర్లు

Nizamabad District : ఆర్మూరులో BRSకు బీటలు... కాంగ్రెస్ లో చేరిన 17 మంది కౌన్సిల‌ర్లు

HT Telugu Desk HT Telugu
Feb 26, 2024 03:58 PM IST

Armoor Municipality: ఆర్మూరులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు…కాంగ్రెస్ గూటికి చేరారు.

కాంగ్రెస్ గూటికి కౌన్సిలర్లు
కాంగ్రెస్ గూటికి కౌన్సిలర్లు

Armoor Municipality: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బీఆర్ఎస్ పార్టీకి బీట‌లు వారాయి. ఏకంగా 17 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ పండిత్ వినిత ప‌వ‌న్‌ తీరుపై తీవ్ర వ్య‌తిరేకంగా ఉన్న కార్పొరేటర్లు.. హ‌స్తం తీర్థం పుచ్చుకున్నారు.

ఇటీవ‌ల రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన త‌రువాత చైర్ ప‌ర్స‌న్‌కు వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం సైతం ప్ర‌వేశ‌పెట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు నుంచే చైర్‌ప‌ర్స‌న్‌ను మార్చాల‌ని ఒక వ‌ర్గం కార్పొరేట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్ప‌టి ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కార్పొరేట‌ర్ల‌ను బుజ్జ‌గిస్తూ ముందుకు వెళ్లారు. చైర్‌ప‌ర్స‌న్ తీరు వ‌ల్ల పార్టీకి న‌ష్టం వ‌స్తోంద‌ని, ఇంటి నెంబ‌ర్ల జారీలో, అభివృద్ధి కార్యక్ర‌మాల్లో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ముందునుంచీ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేకపోయింది. ఇక ఇటీవ‌ల నిర్వ‌హించిన అవిశ్వాస తీర్మానంలోనూ చైర్ ప‌ర్స‌న్ విశ్వాస ప‌రీక్ష గెలిచి పీఠం కైవ‌సం చేసుకున్నారు. కానీ తాజాగా మున్సిపల్ లోని 17 మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు ఖందేష్ సంగీత శ్రీనివాస్, వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, మేడిదాల సంగీత రవి గౌడ్, ఇట్టేడి నర్సారెడ్డి త‌దిత‌రులు మొత్తం 17 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ యాల్ల సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ త‌దిత‌రులున్నారు.

రిపోర్టింగ్ - నిజామాబాద్ జిల్లా ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం