TSPSC Group 4 Recruitment: గుడ్ న్యూస్.. గ్రూప్–4లోకి మరో 141 పోస్టులు - వివరాలివే
TSPSC Group 4 Recruitment 2022: గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరో 141 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో కలుపుతూ అనుబంధ ప్రకటన విడుదల చేసింది.
Telangana Group 4 Recruitment 2022 Updates:తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 4 నోటిఫికేషన్లు రాగా... మరోవైపు ఇతర శాఖలోని పోస్టులు కూడా భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు అన్నీ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం కాగా... తాజాగా గ్రూప్ 4 ఉగ్యోగాలకు సంబంధించి కీలక అప్జేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్–4 కేటగిరీలో మరో 141 పోస్టులను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివారం విడుదల చేసింది. ఫలితంగా త గ్రూప్–4 కేటగిరీలో ఉద్యోగాల సంఖ్య కాస్త 8,180కు చేరింది.
ఈ 141 పోస్టులు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో భర్తీ చేయనున్నారు. ఇందులో బాలుర గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి 86 పోస్టులుండగా, బాలికల విద్యా సంస్థలకు సంబంధించి 55 పోస్టులున్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
భారీగా దరఖాస్తులు
మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. జనవరి 30వ తేదీలో గడువు ముగియనున్న నేపథ్యంలో… శనివారం నాటికి మొత్తం 7,41,159 దరఖాస్తులు వచ్చాయి. చివరి రెండు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2018లో గ్రూప్-4 నోటిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 4.8 లక్షలమంది దరఖాస్తు చేయగా… ఈసారి మాత్రం ఆ సంఖ్య భారీగా పెరిగింది.
పోస్టుల వివరాలు
అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్-44, యనిమల్ హస్పెండరీ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్-2, బీసీ వెల్ఫేర్-307, కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్-72, ఎనర్జీ డిపార్ట్ మెంట్-2, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్-23, ఫైనాన్స్-255, జనరల్ అడ్మినిస్ట్రేషన్-5, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్-338, ఉన్నత విద్యాశాఖ-742, హోమ్ డిపార్ట్ మెంట్-133, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ-7, వ్యవసాయ శాఖ-51, కార్మిక, ఉపాధి కల్పన శాఖ-128, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్-191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్-2701, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్-1245, ప్లానింగ్ డిపార్ట్ మెంట్-2, రెవెన్యూ-2077, ఎస్సీ డెవలప్ మెంట్-474, సెకండరీ ఎడ్యూకేషన్-97, ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్-20, ట్రైబల్ వెల్ఫేర్-221, స్త్రీ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ-18, యూత్, టూరిజం, కల్చర్-13
గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీలో భాగంగా మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలోని ఉద్యోగాలను భర్తీ చేయనుంది. https://tspsc.gov.in/ లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఓటీఆర్ తప్పనిసరిగా ఉండాలి.