WTC Final: లబుషేన్‍కు డెడ్లీ లుక్ ఇచ్చిన సిరాజ్: ఏం జరిగిందంటే!
WTC Final: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబుషేన్‍ను కవ్వించాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. డబ్ల్యూటీసీ ఫైనల్ నేడు మొదలైంది.
WTC Final: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) ఫైనల్ పోరు మొదలైంది. లండన్‍లోని ఓవల్ మైదానం వేదికగా నేడు ఫైనల్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి సెషన్ ఆరంభంలో భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.. ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. స్వింగ్, పేస్‍తో అదరగొట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ ఖవాజా (10 బంతుల్లో 0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత సిరాజ్, లబుషేన్ మధ్య యుద్ధం తీవ్రమైంది.
తొలి ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి అదనపు బౌన్స్ అయి ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ బొటన వేలికి తగిలింది. దీంతో బౌన్స్‌కు లబుషేన్ ఆశ్చర్యపోయాడు. నొప్పి కారణంగా బ్యాట్‍ను వదిలేశాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజులో ఉన్న లబుషేన్ దగ్గరికి వచ్చి ఓ డెడ్లీ లుక్ ఇచ్చాడు. గుర్రుగా చూశాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ ఓ మాట అన్నట్టు తెలుస్తోంది. ఉంగ్లీ తేడ్దే (వేలు విరగ్గొట్టు) అని గిల్ అన్నట్టు సోషల్ మీడియాలో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. సిరాజ్, లబుషేన్ సీన్ చూసి యుద్ధం మొదలైందంటూ కామెంట్లు చేస్తున్నారు.
సిరాజ్ వర్సెస్ లబుషేన్.. హోగయా బ్యాటిల్ స్టార్ట్ (యుద్ధం ప్రారంభమైంది) అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. వేలు విరగ్గొట్టు అని గిల్ సిరాజ్‍కు చెప్పాడని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇలా చాలా మంది యూజర్లు ఈ సిరాజ్, లబుషేన్ సీన్‍పై స్పందిస్తున్నారు.
ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆట సాగుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. ఖవాజా (0), డేవిడ్ వార్నర్ (43) ఔటయ్యారు. వార్నర్ వికెట్‍ను శార్దుల్ ఠాకూర్ పడగొట్టాడు.
ఇక, భారత తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్‍కు చోటు దక్కలేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ ప్లేస్ దక్కించుకోగా.. సీనియర్ అజింక్య రహానేకు ఛాన్స్ దక్కింది. పరిస్థితులను బట్టి తుది జట్టులో ఒకే స్పిన్నర్‌ను తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే అశ్విన్‍ను తప్పించినట్టు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, పుజార, విరాట్ కోహ్లీ, రహానే, ఎస్‍కే భరత్ ( వికెట్ కీపర్), జడేజా, ఠాకూర్, ఉమేశ్ యాదవ్, షమీ, సిరాజ్
సంబంధిత కథనం