Wasim Akram Comments on Malik: నన్ను సర్వెంట్‌లా చూసేవాడు.. మసాజ్ చేయమనేవాడు.. పాక్ మాజీపై అక్రమ్ షాకింగ్ కామెంట్స్-wasim akram says saleem malik treated me like servant ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Akram Comments On Malik: నన్ను సర్వెంట్‌లా చూసేవాడు.. మసాజ్ చేయమనేవాడు.. పాక్ మాజీపై అక్రమ్ షాకింగ్ కామెంట్స్

Wasim Akram Comments on Malik: నన్ను సర్వెంట్‌లా చూసేవాడు.. మసాజ్ చేయమనేవాడు.. పాక్ మాజీపై అక్రమ్ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 10:04 PM IST

Wasim Akram Comments on Malik: పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్.. అప్పటి తన సహచరుడు సలీమ్ మాలిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు తనను సర్వెంట్‌లా చూసేవాడని, బూట్లు, బట్టలు ఉతికిచ్చేవాడని స్పష్టం చేశాడు.

వసీం అక్రమ్-సలీమ్ మాలిక్
వసీం అక్రమ్-సలీమ్ మాలిక్ (Getty)

Wasim Akram Comments on Malik: పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ తన బయోగ్రఫీని సుల్తాన్ ఏ మొమొయిర్(Sultan: A Memoir) పేరిట ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో వసీం అక్రమ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ కెప్టెన్, అప్పట్లో తన సహచర టీమ్ మేట్ సలీమ్ మాలిక్‌పై షాకింగ్ కామెంట్ చేశారు. సలీమ్ తన కంటే సీనియర్ అయినందున.. కెరీర్ ప్రారంభంలో తనతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని, అతడు తనను ఓ సేవకుడిలా చూసేవాడని స్పష్టం చేశాడు.

"అతడు(సలీమ్ మాలిక్) నేను జూనియర్‌ను కావడం వల్ల చాలా చులకనగా చూసేవాడు. నెగిటివ్‌గా ఉండేవాడు. అలాగే స్వార్థపరుడు, నన్ను ఓ సేవకుడిలా చూసేవాడు. మసాజ్ చేయమని నన్ను డిమాండ్ చేసేవాడు. అతడి బూట్లు, బట్టలు ఉతకమని బలవంతం పెట్టేవాడు. నేను నా బాధను నా సహచర యువ ఆటగాళ్లయిన రమీజ్, తాహిర్, మొహిసిన్, షోయబ్ మహమ్మద్‌తో చెప్పుకునేవాడిని" అంటూ వసీం అక్రమ్ తెలిపాడు.

ఇదిలా ఉంటే వసీం అక్రమ్ చేసిన ఆరోపణలను సలీమ్ మాలిక్ ఖండించాడు. తన పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోడానికి ఇలాంటివి సృష్టించాడంటూ మండిపడ్డాడు. అంతేకాకుండా తన కెప్టెన్సీలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ అస్సలు మాట్లాడేవారు కాదని స్పష్టం చేశాడు.

"ఈ వార్త తెలిసిన తర్వాత నేను అక్రమ్‌కు కాల్ చేయడానికి ప్రయత్నించాను. కానీ అతడు ఆన్సర్ చేయలేదు. అతడు అలా ఎందుకు రాశాడో తెలుసుకుందామని ఫోన్ చేశాను. అతను చెప్పినట్లు నేను అంతా చిన్న మనస్సున్న వాడినైతే బౌలింగ్ చేయడానికి అతడికి ఛాన్స్ ఇచ్చేవాడినే కాదు." అంటూ సలీమ్ మాలిక్ తెలిపాడు.

వసీం అక్రమ్ 1984లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. అంతకు రెండేళ్లు ముందు 1982లో సలీమ్ మాలిక్ ఇంటర్నేషనల్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. చాలా ఏళ్ల పాటు వీరిద్దరూ పాకిస్థాన్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాకుండా 1992 నుంచి 95 మధ్య కాలంలో సలీమ్ మాలిక్ పాక్ కెప్టెన్‌గా ఉండగా.. అతడి నేతృత్వంలో వసీం అక్రమ్ ప్రాతినిధ్యం వహించాడు. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో సలీమ్ మాలిక్ దోషిగా నిరూపితమైన జీవిత కాలం నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్