Sundar Replaces Chahar: దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. సౌతాఫ్రికాతో రెండో వన్డేలకు స్పిన్నర్‌తో భర్తీ
India vs South Africa ODI Series: దీపక్ చాహర్‌కు గాయం కావడంతో అతడు స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. వెన్ను నొప్పి కారణంగా బాధపడుతున్న చాహర్‌కు విశ్రాంతినిచ్చింది.
Washington Sundar Replaces Deepak Chahar: టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ గాయం పడిన విషయం తెలిసిందే. సఫారీలతో జరిగిన మూడో టీ20లో వెన్నునొప్పి కారణంగా అతడు ఆ జట్టుతోనే జరగనున్న మిగిలిన రెండు వన్డేలకు దూరం కానున్నాడు. దీంతో బీసీసీఐ అతడి స్థానంలో మరో బౌలర్‌కు అవకాశం కల్పించింది. అతడు ఎవరో కాదు.. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. ఈ విషయాన్ని శనివారం నాడు బీసీసీఐ ప్రకటించింది. చాహర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేస్తాడని, అక్కడి వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో దీపక్ చాహర్ ఆడలేదు.
ఈ నెలలోనే జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్‌గా దీపక్ చాహర్ ఎంపికయ్యాడు. తాజాగా గాయం కావడంతో ఆ టోర్నీకి అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది. అయితే గాయం మరీ అంత తీవ్రతరం కాదని, ప్రపంచకప్ సమయానికి కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది.
ఇప్పటికే వెన్ను గాయంతో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో మహమ్మద్ షమీని ఎంపిక చేసింది టీమిండియా. కోవిడ్ కారణంగా షమీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ మంగళవారంతో ముగియనుంది. ఆదివారం నాడు రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించగా.. దక్షిణాఫ్రికా భారత్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ టీమిండియా లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. పలితంగా మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో చాహర్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ పేస్ అటాక్‌ను ప్రారంభించారు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత జట్టు..
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
సంబంధిత కథనం