Deepak Chahar Injured: దీపక్ చాహర్‌కు గాయం.. దక్షిణాఫ్రికా వన్డేలకు దూరమయ్యే అవకాశం!
Deepak Chahar got Twisted Ankle: టీమిండియా బౌలర్ దీపక్ చాహర్‌కు గాయమైంది. అయితే అది అంత తీవ్రమైన గాయమేమి కాదు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిదని బీసీసీఐ వర్గాల సమాచారం.
Deepak Chahar Injured: టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ముందు రవీంద్ర జడేజా, తర్వాత జస్ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా పొట్టి ప్రపంచకప్‌నకు దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో భారత బౌలర్ చేరే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం భారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన చాహర్.. తొలి మ్యాచ్‌లో స్థానం దక్కించుకోలేదు. తాజాగా చీలమండ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడేది అనుమానంగా మారింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. గురువారం జరిగిన మొదటి వన్డే చాహర్ తుది జట్టుకు ఆడించలేదు.
అయితే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న అతడికి చీలమండ గాయమైంది. అయితే అది అంత తీవ్రమైన గాయమేమి కాదు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిదని బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ కారణంగా టీ20 ప్రపంచకప్ స్టాండ్ బై జాబితాలో దీపక్‌ను ఉండేది లేనిది జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా సందర్భంలో అక్కడ అవసరముంటే అతడి ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది,
ప్రస్తుతానికి టీ20 ప్రపంచకప్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా.. స్థానంలో మహమ్మద్ షమీ ఉన్నాడు. అతడు నిదానంగా ఫిట్నెస్ సాధిస్తున్నాడు. రాబోయే, మూడు లేదా నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాకు షమీ బయల్దేరనున్నాడు. షమీ ఫిట్‌గా ఉంటే ఎప్పుడు తొలి స్థానంలో ఉంటాడు. ఎందుకంటే నాణ్యమైన పరంగా అత్యంత ప్రతిభావంతుడైన బౌలర్ షమీ. అని సమాచారం.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. 250 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్.. పోరాడి ఓడింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 249 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(86), శ్రేయాస్(50) అర్ధశతకాలు వృథా అయ్యాయి.
సంబంధిత కథనం