Virat Kohli: బాబర్ ట్వీట్‌కు విరాట్ స్పందన.. థ్యాంక్స్ అంటూనే ఆసక్తికర కామెంట్
తనకు మద్దతుగా నిలిచినందుకు విరాట్ కోహ్లీ.. బాబర్ అజాంకు థ్యాంక్స్ చెప్పాడు. ఇలాగే ఎదుగుతూ ఉండాలని అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. గత కొంత కాలంగా కోహ్లీ పేలవ ఫామ్‌తో విఫలమవుతున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై ప్రస్తుతం సర్వత్రా తీవ్రంగా చర్చ నడుస్తోంది. చాలా మంది అతడి ప్రదర్శనపై విమర్శలు సంధిస్తున్నారు. టీ20 జట్టు నుంచి కోహ్లీని తప్పించాలని కూడా అంటున్నారు. దీంతో కోహ్లీపై ఒత్తిడి నెలకొంది. ఇలాంటి సమయంలో విరాట్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు కొంత మంది ఆటగాళ్లు. వీరిలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఉన్నారు. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలని కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. తాజాగా విరాట్.. బాబర్ ట్వీట్‌పై స్పందించాడు.
"థ్యాంక్యూ ఇలాగే ప్రకాశిస్తూ.. రోజురోజుకు ఎదుగుతూ ఉండు. ఆల్ ది బెస్ట్ నీకు" అంటూ విరాట్ కోహ్లీ.. బాబర్ అజాం ట్వీట్‌కు బదులిచ్చాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఔటైన తర్వాత సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే పాక్ కెప్టెన్ బాబర్ అజాం మాత్రం అతడికి మద్దతుగా మాట్లాడాడు. ఇది కూడా వెళ్లిపోతుంది. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు కోహ్లీ అంటూ బాబర్ తన స్పందనను తెలియజేశాడు.
అంతేకాకుండా పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా మరోసారి కోహ్లీక మద్దతుగా మాట్లాడాడు. "ఆటగాడిగా నాకు తెలుసు ప్రతి ఒక్కరూ ఫామ్ కోల్పోతారు. ఆ సమయంలో ప్లేయర్లకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. ఆటగాళ్లకు సపోర్ట్ అవసరం. నేను ఇప్పుడే అతడికి(కోహ్లీ) మద్దతుగా ట్వీట్ చేశాను. అతడు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అతడికి ఎంతో అనుభవముంది. ఈ దశ నుంచి ఎలా బయటకు రావాలో అతడికి బాగా తెలుసు. ఆటగాళ్లు మళ్లీ పుంజుకోవాలంటే కాస్త సమయం కావాలి." అని బాబర్ స్పష్టం చేశాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వరుసగా విఫలం కావడంతో టీమిండియా ఓటమి పాలైంది. ఫలితంగా సిరీస్ 1-1 తేడాతో సమమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం జరగనుంది.
సంబంధిత కథనం