Rohit Sharma and Virat Kohli Celebrations: విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్-virat kohli rohit sharma celebrations at staircase video goes viral on social media ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Rohit Sharma Celebrations At Staircase Video Goes Viral On Social Media

Rohit Sharma and Virat Kohli Celebrations: విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్

HT Telugu Desk HT Telugu
Sep 26, 2022 09:47 AM IST

Rohit Sharma: ఆదివారం జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజ‌యాన్ని సాధించిన టీమ్ ఇండియా సిరీస్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో ఇండియా విజ‌యం సాధించ‌గానే రోహిత్ శ‌ర్మ‌, విరాట్ క‌లిసి సంబ‌రాలు చేసుకున్నారు. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ
విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ (twitter)

Rohit Sharma: ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. టీ20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాపై సాధించిన ఈ విజయం టీమ్ ఇండియా ప్లేయర్లలో ఆత్మస్థ్యైరాన్ని నింపుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మూడో టీ20 మ్యాచ్ లో ముప్పై పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను సూర్యకుమార్ యాదవ్ తో కలిసి విరాట్ కోహ్లి (Virat Kohli) గట్టెక్కించాడు.

కోహ్లి 48 బాల్స్ లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 63 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్(Surya kumar yadav) 36 బాల్స్ లో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 69 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో టీమ్ ఇండియా విజయానికి 11 రన్స్ అవసరమైన తరుణంలో ఫస్ట్ బాల్ కు కోహ్లి కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఫించ్ పట్టిన అద్భుత క్యాచ్ తో వెనుదిరిగాడు. డ్రెస్సింగ్ రూమ్ వెళ్లకుండా మెట్లపైనే రోహిత్ శర్మ తో కలిసి కూర్చొని మ్యాచ్ చూశాడు కోహ్లి.

సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టిన కోహ్లిని భుజంపై త‌ట్టి రోహిత్ శ‌ర్మ అభినందించాడు. పాండ్య ఫోర్ తో టీమ్ ఇండియాను గెలిపించగానే మెట్లపైనే కోహ్లి, విరాట్ సంబరాలు చేసుకున్నారు. ఒక‌రికొకరు హ‌గ్ ఇచ్చుకుంటూ కేరింత‌లు కొట్టారు. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. రోహిత్ క్రీడాస్ఫూర్తికి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

WhatsApp channel