Virat Kohli | కోహ్లి ఫేవరెట్ అథ్లెట్ ఎవరో తెలుసా?
virat Kohli ఎంతోమంది ఫేవరెట్ క్రికెటర్. ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న ఇండియన్ అతడు. మరి అలాంటి ప్లేయర్‌కు నచ్చిన అథ్లెట్ ఎవరు?
ముంబై: ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ ఆడటమే కాదు.. ఫీల్డ్ బయట ఎన్నో ఫన్ యాక్టివిటీస్ చేస్తుంటారు క్రికెటర్లు. ఫొటో షూట్లు, యాడ్స్‌లో నటించడం, ఫన్నీ గేమ్స్ ఆడటం వంటివి వాళ్లు చేస్తారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా ఓ ఫొటో షూట్‌లో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా ఆ టీమ్ ప్లేయర్స్ విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వాళ్ల ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? ఒకవేళ వాళ్లలాగా మీరు మారితే ఏం చేస్తారు? ఐపీఎల్ బెస్ట్, వరస్ట్ మూమెంట్స్ ఏవి? వంటి ప్రశ్నలు అడిగారు. ఈ వీడియోను ఆర్సీబీ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
దీనికి విరాట్‌తోపాటు సిరాజ్, డుప్లెస్సి కూడా సమాధానాలు చెప్పారు. తన ఫేవరెట్ అథ్లెట్ ఎవరు అని విరాట్‌ను అడిగినప్పుడు మరో ఆలోచన లేకుండా క్రిస్టియానో రొనాల్డో అని చెప్పాడు. అటు సిరాజ్ కూడా ఇదే ఆన్సర్ ఇవ్వగా.. డుప్లెస్సి మాత్రం టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పేరు చెప్పాడు. ఒకవేళ సడెన్‌గా ఒకరోజు క్రిస్టియానో రొనాల్డోగా నిద్రలేస్తే ఏం చేస్తావని అడిగితే.. విరాట్ కాస్త ఫన్నీగా సమాధానమిచ్చాడు. ముందుగా నా బ్రెయిన్‌ను స్కాన్ చేసి.. అంత మానసిక బలం ఎలా వచ్చిందో చూస్తాను అని కోహ్లి చెప్పడం విశేషం.
ఇక తన కెరీర్‌లో బాగా నిరాశ కలిగించిన సందర్భాల గురించీ విరాట్ పంచుకున్నాడు. 2016 ఐపీఎల్ ఫైనల్, అదే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లలో ఓడటం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని కోహ్లి చెప్పాడు. నిజానికి 2016 ఐపీఎల్‌లో విరాట్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీ మొత్తంలో 81 సగటుతో 973 రన్స్ చేశాడు. ఇప్పటికీ ఒక సీజన్‌లో ఓ ప్లేయర్ చేసిన అత్యధిక రన్స్ ఇవే కావడం విశేషం. ఆ సీజన్‌లో ఒంటిచేత్తో ఆర్సీబీని ఫైనల్‌కు తీసుకెళ్లినా.. ట్రోఫీ మాత్రం గెలిపించలేకపోయాడు.
సంబంధిత కథనం