Umesh Yadav about Indore Test: లక్ష్యం తక్కువైనా గెలుస్తాం.. ఇండోర్ టెస్టుపై ఉమేష్ యాదవ్ ధీమా-umesh yadav hopeful of indian win in indore test despite 76 run target for australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umesh Yadav About Indore Test: లక్ష్యం తక్కువైనా గెలుస్తాం.. ఇండోర్ టెస్టుపై ఉమేష్ యాదవ్ ధీమా

Umesh Yadav about Indore Test: లక్ష్యం తక్కువైనా గెలుస్తాం.. ఇండోర్ టెస్టుపై ఉమేష్ యాదవ్ ధీమా

Maragani Govardhan HT Telugu
Mar 03, 2023 08:12 AM IST

Umesh Yadav about Indore Test: ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై గెలుస్తామని టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. లక్ష్యం తక్కువైనా భారత్‌కు గెలిచేందుకు అవకాశముందని అన్నాడు.

ఉమేష్ యాదవ్
ఉమేష్ యాదవ్ (ANI)

Umesh Yadav about Indore Test: ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్.. ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించిన విషయం తెలిసిందే. ఆసీస్ గెలవాలంటే రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. ఇంత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడం పర్యాటక జట్టుకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. ఈ లక్ష్యం సరిపోదని పుజారా లాంటి స్టార్ బ్యాటర్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ మాత్రం ఆ స్వల్ప లక్ష్యంతోనే టీమిండియా గెలిచే అవకాశముందని తెలిపాడు. రోజులు గడుస్తున్న కొద్ది పిచ్‌ బౌలింగ్‌కు బాగా సహకరిస్తుందని, తొలి రోజు 14 వికెట్లు పడితే.. రెండో రోజైన గురువారం 16 వికెట్ల పడ్డాయని స్పష్టం చేశాడు. కాబట్టి ఏదైనా జరుగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. మేము మా వంతు కఠినంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది అంతా సులభమైన వికెట్ కాదు. అది మా బ్యాటర్లకైనా, వారికైనా కష్టమే. బంతిని కొట్టడం అంత సులభం కాదు. బంతి కిందకు వస్తంది. కాబట్టి బయటకు వచ్చి ఆడటం కష్టం. లక్ష్యం తక్కువగా ఉంది. కానీ మా లైన్ లెంగ్త్‌ కరెక్టుగా ఉంటే వీలైనంత వరకు గెలిచేందుకు పుష్ చేస్తాము." అని ఉమేశ్ యాదవ్ అన్నాడు.

"నా ప్లాన్ ఏంటంటే నేరుగా బౌలింగ్ చేసిన నేను ఒకటి లేదా రెండు వికెట్లు పడగొట్టడం. ఫాస్ట్ బౌలర్‌గా నేను ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలి. అందులోనూ సరైన ఏరియాలో బౌలింగ్ చేయాలి. నేను క్రికెట్‌లో ఎక్కువ భాగం భారత్‌లో ఆడాను. నా ఆలోచనా విధానం ఎప్పుడు వికెట్ తీయడంపైనే ఉంటుంది. నేటి మ్యాచ్ లో నేను బౌలింగ్ చేసిన ఏరియా సీమర్లకు అనుకూలించింది. " అని ఉమేష్ యాదవ్ తెలిపాడు

ఇండోర్ వేదికగా జరిగిన రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌటైంది. రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా.. అశ్విన్, ఉమేష్ యాదవ్ చెరో 3 వికెట్లతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 163 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కేవలం 75 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది. నాథన్ లయన్ 64 పరుగులిచ్చి 8 వికెట్ల తీశాడు. మూడో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం