Smriti Mandhana on WBBL: బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా: స్మృతి మంధానా-smriti mandhana on bbl says she will consider to withdraw from the league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Smriti Mandhana On Wbbl: బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా: స్మృతి మంధానా

Smriti Mandhana on WBBL: బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా: స్మృతి మంధానా

Hari Prasad S HT Telugu
Sep 12, 2022 09:48 PM IST

Smriti Mandhana on WBBL: బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా. బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త బ్రేక్‌ కోసమే తాను ఈ ఆలోచన చేస్తున్నట్లు చెప్పింది.

<p>స్మృతి మంధానా</p>
స్మృతి మంధానా (PTI)

Smriti Mandhana on WBBL: ఇండియన్‌ మెన్స్‌ టీమ్‌లాగే వుమెన్స్‌ టీమ్‌ కూడా ఈ మధ్య బిజీగా గడుపుతోంది. వరుస టూర్లు, సిరీస్‌లతో వుమెన్‌ క్రికెటర్లు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇది వాళ్లకు ఓ సవాలుగా మారింది. తాజాగా స్టార్‌ బ్యాటర్‌, ఇండియన్‌ టీమ్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా ఈ పనిభారం నుంచి కాస్త విశ్రాంతి కోసం అంటూ బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది.

గత కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి స్మృతి వరుసగా క్రికెట్‌ ఆడుతూనే ఉంది. ఆ గేమ్స్‌ ముగిసిన తర్వాత ది హండ్రెడ్‌ టోర్నీలో ఆడేందుకు ఇంగ్లండ్‌లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె అక్కడే జరుగుతున్న వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ టూర్‌లోనే ఉంది. అది ముగియగానే మహిళల ఆసియా కప్‌ కోసం బంగ్లాదేశ్‌ వెళ్లనుంది. ఈ టోర్నీ అక్టోబర్‌ 1 నుంచి 16 వరకూ జరగనుంది.

కామన్వెల్త్‌ గేమ్స్‌ కంటే ముందు కూడా న్యూజిలాండ్‌ టూర్‌, వన్డే వరల్డ్‌కప్‌లలో స్మృతి ఆడింది. ఇక ఇప్పుడు ఆసియా కప్‌లో ఆడుతున్న సమయంలోనే వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. దీంతో ఈ లీగ్‌కు వెళ్లకూడదని భావిస్తున్నట్లు ఆమె చెప్పింది. దీనికి మానసికపరమైన ఒత్తిడి కంటే కూడా శారీరక ఒత్తిడే ఎక్కువ కారణమని స్మృతి తెలిపింది.

"వుమెన్స్‌ బీబీఎల్‌ నుంచి తప్పుకోవడాన్ని కచ్చితంగా పరిశీలిస్తా. ఎందుకంటే ఇండియాకు ఆడటాన్ని మిస్‌ కావడమో లేక గాయపడటమో జరగకూడదని అనుకుంటున్నా. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు నా 100 శాతం ఇవ్వాలని నేను భావిస్తా. అందుకే బిగ్‌బాష్‌ నుంచి తప్పుకోవడాన్నే పరిశీలిస్తా" అని స్మృతి చెప్పంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత 5 టీ20ల కోసం ఆస్ట్రేలియా వుమెన్స్‌ టీమ్‌ ఇండియాకు రానుంది.

ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని టీమ్‌ సౌతాఫ్రికాలో వెస్టిండీస్‌ కూడా ఆడే ట్రైసిరీస్‌లో తలపడుతుంది. ఇక ఆ వెంటనే ఫిబ్రవరిలో వుమెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ జరగనుంది. ఆ తర్వాత మార్చిలో వుమెన్స్‌ ఐపీఎల్‌ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో ఏడాది పాటు ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ క్రికెట్‌కు దూరంగా ఉంది. దీంతో ఇప్పుడు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ను తాను మిస్‌ కావద్దని భావిస్తున్నానని, ఓ వుమన్‌ ప్లేయర్‌గా తానెప్పుడూ ఇలాంటి షెడ్యూల్‌నే కోరుకుంటానని స్మృతి చెప్పింది.

Whats_app_banner

టాపిక్