Commonwealth Games 2022: 22 గోల్డ్‌.. మొత్తం 61 మెడల్స్‌తో నాలుగోస్థానంతో ముగించిన ఇండియా-india finished fourth in medals tally with 61 medals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Finished Fourth In Medals Tally With 61 Medals

Commonwealth Games 2022: 22 గోల్డ్‌.. మొత్తం 61 మెడల్స్‌తో నాలుగోస్థానంతో ముగించిన ఇండియా

Hari Prasad S HT Telugu
Aug 08, 2022 09:05 PM IST

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియా నాలుగోస్థానంతో ముగించింది. చివరి రోజు నాలుగు గోల్డ్‌ సహా మొత్తం ఆరు మెడల్స్‌ సాధించింది.

ఇండియాకు అత్యధికంగా ఆరు గోల్డ్ మెడల్స్ అందించిన రెజ్లర్లు
ఇండియాకు అత్యధికంగా ఆరు గోల్డ్ మెడల్స్ అందించిన రెజ్లర్లు (Twitter)

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022ను ఇండియా మొత్తంగా 61 మెడల్స్‌తో టేబుల్లో నాలుగోస్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 22 గోల్డ్‌, 16 సిల్వర్‌, 23 బ్రాంజ్‌ మెడల్స్‌ ఉన్నాయి. గోల్డ్‌ మెడల్స్‌ పరంగా చూస్తే కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియాకు ఇది నాలుగో ఉత్తమ ప్రదర్శన. 2010లో ఢిల్లీలో జరిగిన గేమ్స్‌లో అత్యధికంగా 101 మెడల్స్ గెలవగా.. 2002లో 69, 2018లో 66, 2014లో 64 మెడల్స్‌ ఇండియా గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

ఈసారి గేమ్స్‌లో ఆస్ట్రేలియా 178 (67 గోల్డ్‌ మెడల్స్‌) మెడల్స్‌తో తొలిస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్‌ 176 (57 గోల్డ్‌), కెనడా 92 (26 గోల్డ్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈసారి గేమ్స్‌ నుంచి షూటింగ్‌ను తొలగించడంతో అది ఇండియా మెడల్స్‌పై ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. గతంలో ఇండియాకు ఈ షూటింగ్‌లోనే అత్యధికంగా 135 మెడల్స్‌ వచ్చాయి.

రెజ్లర్లే స్టార్లు

అయితే ఈసారి వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్స్‌, బ్యాడ్మింటన్‌ స్టార్లు ఆ లోటు లేకుండా చూశారు. మొత్తంగా ఇండియాకు 12 మెడల్స్‌తో రెజ్లర్లు టాప్‌లో నిలిచారు. అందులో ఆరు గోల్డ్‌ మెడల్స్ ఉన్నాయి. బరిలోకి దిగిన ప్రతి రెజ్లర్‌ ఏదో ఒక మెడల్‌ గెలవడం విశేషం. ఇక వెయిట్‌లిఫ్టర్లు 10 (3 గోల్డ్‌), టేబుల్‌ టెన్నిస్‌ 7 (4 గోల్డ్‌) మెడల్స్‌ అందించాయి.

ఇక చివరి రోజు బ్యాడ్మింటన్ స్టార్లు చెలరేగారు. మొత్తం మూడు గోల్డ్ మెడల్స్ కోసం తలపడి అన్నింట్లోనూ విజేతలుగా నిలిచారు. సింగిల్స్ లో పీవీ సింధు, లక్ష్యసేన్, మెన్స్ డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గోల్డ్ మెడల్స్ గెలిచారు. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సిల్వర్ తో సరిపెట్టుకోగా.. టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ గోల్డ్ తో ముగించాడు.

ఊహించని స్టార్లు

ఈసారి అథ్లెటిక్స్‌, లాన్‌ బౌల్స్‌, పారా పవర్‌లిఫ్టింగ్‌లలోనూ ఇండియా ఆశ్చర్యకరంగా మంచి ఫలితాలు సాధించింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఇండియా ఆరు మెడల్స్‌ గెలిచింది. ట్రిపుల్‌ జంప్‌లో ఎల్దోస్‌ పాల్‌ గోల్డ్‌ గెలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో చారిత్రక సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. అటు లాన్‌బౌల్స్‌లో ఎప్పుడూ లేని విధంగా గోల్డ్‌ మెడల్‌తో ఇండియన్ వుమెన్స్‌ టీమ్‌ చరిత్ర సృష్టించింది.

మొత్తంగా 61 మెడల్స్‌లో పురుషులు 35, మహిళలు 23 మెడల్స్‌ తీసుకురాగా.. మిక్స్‌డ్‌ ఈవెంట్స్‌లో 3 మెడల్స్‌ వచ్చాయి. పురుషులు 13 గోల్డ్‌, 9 సిల్వర్‌, 13 బ్రాంజ్‌ మెడల్స్‌ గెలిచారు. ఇక మహిళలు 8 గోల్డ్‌, 6 సిల్వర్‌, 9 బ్రాంజ్‌ గెలవగా.. మిక్స్‌డ్‌ ఈవెంట్లలో ఒక్కో గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ వచ్చాయి.

WhatsApp channel

సంబంధిత కథనం