Smriti Mandhana: టీ20ల్లో స్మృతి మంధానా రికార్డు.. రోహిత్‌శర్మ తర్వాత ఆమెనే..-smriti mandhana becomes second indian opener after rohit sharma to score 2000 t20i runs ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Smriti Mandhana: టీ20ల్లో స్మృతి మంధానా రికార్డు.. రోహిత్‌శర్మ తర్వాత ఆమెనే..

Smriti Mandhana: టీ20ల్లో స్మృతి మంధానా రికార్డు.. రోహిత్‌శర్మ తర్వాత ఆమెనే..

Hari Prasad S HT Telugu
Aug 04, 2022 05:04 PM IST

Smriti Mandhana: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా టీ20ల్లో ఓ అరుదైన రికార్డు అందుకుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకున్న ఆమె.. రోహిత్‌ శర్మ తర్వాత రెండో ఇండియన్‌ ప్లేయర్‌గా నిలిచింది.

<p>స్మృతి మంధానా</p>
స్మృతి మంధానా (PTI)

బర్మింగ్‌హామ్: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా మరో రికార్డును తన పేరిట రాసుంది. బుధవారం (ఆగస్ట్ 3) బార్బడోస్‌తో మ్యాచ్‌లో 5 రన్స్‌ చేసిన స్మృతి టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2000 రన్స్‌ పూర్తి చేసుకుంది. మెన్స్‌ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో 2 వేల రన్స్‌ పూర్తి చేసుకున్న రెండో ఓపెనర్‌గా స్మృతి నిలిచింది.

బార్బడోస్‌తో మ్యాచ్‌లో ఫెయిలైనా.. ఈ రికార్డును ఆమె సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా మంధానా 79 ఇన్నింగ్స్‌లో 2004 రన్స్ చేసింది. ఆమె సగటు 27.45 కాగా.. అందులో 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్‌ స్కోరు 86. అటు రోహిత్‌ శర్మ కూడా ఓపెనర్‌గా ఇండియాకు భారీగా రన్స్‌ చేసి పెట్టాడు. రోహిత్‌ ఇప్పటి వరకూ 96 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌ చేయగా.. 33 సగటుతో 2973 రన్స్‌ చేశాడు.

రోహిత్‌ 4 సెంచరీలు, 22 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అతని బెస్ట్‌ స్కోరు 118 రన్స్‌. ఇప్పుడు రోహిత్‌ తర్వాత ఓపెనర్‌గా వచ్చి అంతర్జాతీయ టీ20ల్లో స్మృతి మంధానా 2000 రన్స్ చేసింది. ప్రస్తుతం కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆమె మూడు మ్యాచ్‌లలో 92 రన్స్‌ చేసింది. అందులో పాకిస్థాన్‌పై 63 రన్స్‌ చేసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది.

ఇక బుధవారం బార్బడోస్‌తో మ్యాచ్‌లో మంధానా ఫెయిలైనా.. ఇండియా మాత్రం 100 రన్స్‌తో ఘనంగా గెలిచి సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 43, జెమీమా రోడ్రిగ్స్‌ 56, దీప్తి వర్మ 34 రన్స్‌ చేయడంతో ఇండియా 4 వికెట్లకు 162 రన్స్‌ చేసింది. ఆ తర్వాత బార్బడోస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 62 రన్స్‌ మాత్రమే చేయగలిగింది.

Whats_app_banner

సంబంధిత కథనం