Shubman Gill breaks Kohli Record: మరో విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్
Shubman Gill breaks Kohli Record: మరో విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్. న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగుతున్న మూడో వన్డేలో గిల్ ఈ ఘనత అందుకున్నాడు.
Shubman Gill breaks Kohli Record: తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. న్యూజిలాండ్ పై తొలి వన్డేలోనే అతడు డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయసు ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు మూడో వన్డేలో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
మూడు వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా గిల్ నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లిని అధిగమించాడు. గతంలో విరాట్ 3 వన్డేల సిరీస్ లో 283 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ కు ముందు దానికి 36 పరుగుల దూరంలో ఉన్న గిల్ సులువుగా వాటిని సాధించేశాడు. అంతేకాదు వన్డే క్రికెట్ లో గత నాలుగు ఇన్నింగ్స్ లో 400కుపైగా రన్స్ చేయడం విశేషం.
ఈ మ్యాచ్ లో అతడు కేవలం 33 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 22 రన్స్ చేశాడు. ఆ ఓవర్లో గిల్ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాదడం విశేషం. విరాట్ కోహ్లి ఈ మధ్యే శ్రీలంకతో సిరీస్ లో 283 రన్స్ చేసి రికార్డు క్రియేట్ చేయగా.. దానిని ఇప్పుడు గిల్ అధిగమించాడు. విరాట్ ఆ మూడు వన్డేల సిరీస్ లో 113, 4, 166 రన్స్ చేశాడు.
హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతోపాటు వన్డేల్లో అత్యంత వేగంగా 1000 రన్స్ చేసిన ఇండియన్ ప్లేయర్ గా కూడా గిల్ నిలిచిన విషయం తెలిసిందే. అతడు కేవలం 19 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించగా.. అంతకుముందు విరాట్ కోహ్లి, ధావన్ పేరిట 24 ఇన్నింగ్స్ తో ఉన్న రికార్డు మరుగున పడిపోయింది.
సంబంధిత కథనం