IPL2022 | అర్జున్ తెందూల్కర్‌ ఇంకా కష్టపడాలి.. షేన్ బాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు-shane bond says arjun tendulkar have to earn him spot ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl2022 | అర్జున్ తెందూల్కర్‌ ఇంకా కష్టపడాలి.. షేన్ బాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL2022 | అర్జున్ తెందూల్కర్‌ ఇంకా కష్టపడాలి.. షేన్ బాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Jun 03, 2022 03:48 PM IST

ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్.. అర్జున్ తెందూల్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు జట్టులో చోటు సంపాదించాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.

<p>అర్జున్ తెందూల్కర్</p>
అర్జున్ తెందూల్కర్ (Twitter)

క్రికెట్‌లో వారసత్వం కంటే కూడా ప్రతిభ చాలా ముఖ్యం. తండ్రి సచిన్ తెందూల్కర్ అయినంత మాత్రన కుమారుడికి అంత సులభంగా జట్టులో చోటు దక్కదు. కేవలం ప్రతిభ, కఠోర దీక్ష ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ ప్రతిభతోనే సచిన్ తనయనుడు అర్జున్.. ఈ ఏడాది తొలిసారిగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ అతడి కొనుగోలు చేసింది. 30 లక్షలకు అర్జున్ తెందూల్కర్‌ను కొనింది. అయితే తుది జట్టులో మాత్రం అతడికి చోటు కల్పించలేదు. ప్లేఆఫ్ నుంచి తొలగించినప్పటికీ తుదిజట్టులో మాత్రం అతడిని తీసుకోలేదు. తాజాగా ఈ విషయంపై ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు.

"ముంబయి లాంటి జట్టు తరఫున ఆడాలంటే అతడు(అర్జున్ తెందూల్కర్) ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడు చోటుు సంపాదించాలంటే అకుంఠిత దీక్ష, పట్టుదల, కరోర శ్రమ ఇంకా చేయాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరితో గేమ్ విషయంలో చిన్న గీత ఉంటుంది. కానీ మీరు మీ స్థానాన్ని కూడా సంపాదించుకోవాలి. అర్జున్ విషయంలో బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై అతడు ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇలాగే కష్టపడితే పురోగతిని సాధించి జట్టులో స్థానాన్ని సంపాదించుకోగలడు" అని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పష్టం చేశాడు.

మెగావేలంలో అర్జున్ తెందూల్కర్‌ను ముంబయి రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు తన కెరీర్‍‌లో కేవలం 2 టీ20లు మాత్రమే ఆడాడు. 33.50 సగటుతో 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అర్జున్ ఈ ఏడాది జనవరిలో ముంబయి తరఫున హరియాణాపై తన టీ20లో అరంగేట్రం చేశాడు. తన తదుపరి మ్యాచ్ పుదుచ్చెరితో ఆడాడు.

ఈ ఏడాది ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో మ్యాచ్ అన్నింటి కంటే ముందుగానే ఎలిమినేట్ అయింది. పాయింట్ల పట్టికలో అన్నింటి కంటే దిగువ స్థానంలో టోర్నీని ముగించింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్