Asia Cup: తన కెప్టెన్సీ విధానం గురించి వివరించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?-rohit sharma spoken about his approach to captaincy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup: తన కెప్టెన్సీ విధానం గురించి వివరించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

Asia Cup: తన కెప్టెన్సీ విధానం గురించి వివరించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

Maragani Govardhan HT Telugu
Aug 19, 2022 08:49 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ గురించి వివరించాడు. ఆసియా కప్ లాంటి హై ప్రొఫైల్ టోర్నీలో తన విధానం ఎలా ఉంటుందో వివరించాడు. ఆసియా కప్ ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు జరగనుంది.

<p>రోహిత్ శర్మ</p>
రోహిత్ శర్మ (PTI)

టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే తొలి వన్డే వెగ్గి 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌ తర్వాత ఆసియా కప్ ఆడనుంది టీమిండియా. ఈ టోర్నీకి భారత పుల్ టైమ్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా ఆసియా కప్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో రోహిత్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కెప్టెన్సీ విధానం గురించి వివరించాడు.

"నేను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజితో ఏళ్ల తరబడి ఏం చేశానో, అలాగే టీమిండియా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. జట్టును క్లిష్టతరంగా చేయకుండా సింపుల్‌గా ఉంచుతూ.. ముందుకు నడిపించాలని అనుకుంటున్నా. కుర్రాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం, వారి పాత్ర ఏంటో వారికి అర్థమయ్యేలా వివరించడం చేస్తాను. ఇదే విధానాన్ని నా నుంచి ఆశిస్తున్నాను" అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

"జట్టుకు, ఆటగాళ్లకు గందరగోళం, కంగారు లేకుండా నేను చూసుకోవాలి. ఓ పెద్ద టోర్నీ ఆడబోయే ముందు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేము అన్ని విషయాలను పక్కాగా ఉండేలా చూసుకుంటున్నాము. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్‌తో పాటు నా పాత్ర కీలకం అవుతుంది. దానిపైనే దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఇది నాకు సులభమనే భావిస్తున్నాను." అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ నెల 28 పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ 15వ ఎడిషన్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా ఆరుజట్లతో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఏడు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. గత ఎడిషన్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా.. ఈ సారి మాత్రం టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం