Rohit Sharma: టీ20ల్లో కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ-rohit sharma breaks virat kohlis record in t20i cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma Breaks Virat Kohlis Record In T20i Cricket

Rohit Sharma: టీ20ల్లో కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

Nelki Naresh Kumar HT Telugu
Jul 30, 2022 01:08 PM IST

వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో హాఫ్ సెంచరీతో రాణించాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో రెండు అరుదైన రికార్డులను రోహిత్ బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఏవంటే...

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (twitter)

శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నది. విశ్రాంతి కారణంగా వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న రోహిత్ టీ20ల కోసం తిరిగి జట్టులో చేరాడు. తొలి మ్యాచ్ లోనే కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కేవలం 44 బాల్స్ లోనే రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 64 రన్స్ చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో రెండు అరుదైన రికార్డ్స్ ను రోహిత్ శర్మ ఛేదించాడు.

3443 రన్స్ తో టీ20 క్రికెట్ లో ఇంటర్ నేషనల్ లెవల్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ (3399 రన్స్) పేరు మీద ఉంది. వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 ద్వారా గప్టిల్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ లిస్ట్ లో 3308 పరుగులతో విరాట్ కోహ్లి (Virat Kohli) మూడో స్థానంలో ఉన్నాడు.

ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ (2894 రన్స్), అరోన్ ఫించ్ (2855 రన్స్) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. అలాగే వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్ కోహ్లి రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. కోహ్లి 30 హాఫ్ సెంచరీలు చేయగా రోహిత్ శర్మ 31 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ రికార్డు జాబితాలో 27 హాఫ్ సెంచరీలతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మూడో స్థానంలో ఉన్నాడు. 23 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ నాలుగో స్థానం, 22 హాఫ్ సెంచరీలతో గప్టిల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం