RCB Twitter Hacked : ఆర్సీబీకి బిగ్ షాక్.. ట్విట్టర్ హ్యాక్ చేసి పేరు మార్చేశారు
RCB Twitter Account Hacked : ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి బిక్ షాక్ తగిలింది. వారి ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు.. హ్యాక్ చేసి.. పేరు మార్చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఇప్పుడు ఆ ఖాతా పేరును మార్చడమే కాకుండా ఆ ఖాతాలో NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. IPLలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్సీబీ ఒకటి. అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న RCB సోషల్ మీడియా ఖాతా నిరంతరం హ్యాక్ చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా ఆర్సీబీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఖాతా పేరును Bored Ape Yacht Club మార్చారు. అంతేకాకుండా, RCB లోగో, ప్రొఫైల్ చిత్రాన్ని కూడా హ్యాకర్లు మార్చారు. ఆ ఖాతాలో NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. తమ అధికారిక వెబ్‌సైట్ గురించి కూడా సమాచారం ఇచ్చారు.
RCB ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీమ్ ట్విట్టర్(Twitter) ఖాతా హ్యాక్ అయింది. RCB ట్విట్టర్ ఖాతాలను రెండుసార్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఆగస్టు 2022లో RCB YouTube ఛానెల్‌ని ఒకసారి హ్యాక్ చేశారు.
అయితే గతంలో హ్యాక్ చేయగా.. ఆర్సీబీ(RCB) ఖాతాను పునరుద్ధరించగలిగింది. 'మా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. కొన్ని గంటల క్రితం తిరిగి వచ్చింది. మేము ఇప్పుడు యాక్సెస్‌ను తిరిగి పొందగలిగాం. హ్యాకర్లు పెట్టిన ట్వీట్‌ను మేం ఖండిస్తున్నాం. తొలగించిన ఆ ట్వీట్ నుండి ఎలాంటి కంటెంట్‌ను ఆమోదించం. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.' అని RCB అప్పట్లో ట్వీట్ చేసింది.