MS Dhoni Good at Review: ఆ విషయంలో ధోనీని మించిన వారు లేరు.. రివ్యూ తీసుకోకపోవడంపై రవి శాస్త్రీ కామెంట్
Ravi Shastri MS Dhoni Reference: రివ్యూ విషయంలో టీమిండియా ఆటగాళ్ల అలసత్వానికి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఐదో ఓవర్లో ఆసీస్ బ్యాటర్ కేమరూన్ గ్రీన్ ఎల్బీని అప్పీల్ చేయకపోవడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. రివ్యూ చేయడంలో ధోనీని మించిన వారు లేరని రవిశాస్త్రీ అభిప్రాయపడ్డాడు.
Ravi Shastri MS Dhoni Reference: టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆసీస్ బ్యాటర్ కేమరూన్ గ్రీన్, వేడ్.. అద్భుత ప్రదర్శనకు.. టీమిండియా బౌలర్లు, ఫీల్డర్ పేలవ ప్రదర్శన తోడవ్వడంతో కంగారూ జట్టు ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల వైఫల్య స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కేమరూన్ గ్రీన్ ఎల్బీడబ్ల్యూ ఔటైనప్పుడు రివ్యూ కోరకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
యజువేంద్ర చాహల్ వేసిన ఐదో ఓవర్‌లో కేమరూన్ గ్రీన్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే భారత ఆటగాళ్లు మాత్రం రివ్యూ కోరకుండా మిన్నకుండారు. ఫలితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతి గ్రీన్ ప్యాడ్లకు తగలగా.. భారత ఆటగాళ్లు ఎవరూ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయకపోవడం గమనార్హం. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్, చాహల్, కెప్టెన్ రోహిత్ శర్మ సైలెంట్‌గా ఉండటం గమనార్హం. అనంతరం ఆరో ఓవర్‌లో రీప్లేలో క్లియర్ గ్రీన్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు తేలింది. దీంతో ఒకరి ముఖం చూసుకోవడం టీమిండియా ప్లేయర్ల వంతైంది.
ఈ విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాళ్లు విమర్శలు సంధించారు. క్లియర్‌గా ఎల్బీ అయితే.. టీమిండియా ప్లేయర్లు రివ్యూ కోరకపోవడమేంటి? అని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇలాంటి ఔట్‌ను అప్పీల్ చేయకపోవడమేంటని రవిశాస్త్రీ స్పష్టం చేశాడు. ఇలాంటి సమయాల్లో కీపర్లు ముఖ్య పాత్ర పోషిస్తారని, ఈ విషయంలో ఎంఎస్ ధోనీని మించిన వారు లేరని స్పష్టం చేశారు.
ఈ టీ20లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీస్.. మూడు టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. మొదట్లో కామెరాన్ గ్రీన్ (30 బాల్స్‌లో 61), చివర్లో మాథ్యూ వేడ్(21) 45) మెరుపులు మెరిపించి ఆస్ట్రేలియాకు కళ్లు చెదిరే విజయాన్ని అందించారు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
స్టార్ బౌలర్లు భువనేశ్వర్, చహల్, హర్షల్ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(55), హార్దిక్ పాండ్య(71) అర్ధశతకాలతో చెలరేగగా సూర్యకుమార్ యాదవ్(71) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో బ్యాట్ ఝుళిపించాడు. ఫలితంగా భారత్ 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో టీ20 నాగ్‌పుర్ వేదికగా శుక్రవారం జరగనుంది.
సంబంధిత కథనం