Ravi Shastri on Return to Coaching: కోచ్‌గా రవిశాస్త్రీ తిరిగొస్తారా? ఏడేళ్ల కోచింగ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri As Coach: టీమిండియా కోచ్‌గా తిరిగొస్తారా అనే ప్రశ్నకు రవిశాస్త్రీ ఆసక్తికకర సమాధానమిచ్చారు. కోచ్‌గా తన కాలం ముగిసిందని స్పష్టం చేశారు. గతేడాది ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రీ కోచ్‌గా తప్పించిన సంగతి తెలిసిందే.
Ravi Shastri on His Coaching: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రీ.. కోచ్‌గా భారత జట్టుకు విశేష సేవలందించిన విషయం తెలిసిందే. టీమిండియా కోచ్‌ల్లో అత్యంత విజయవంతమైన వారిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జట్టుకు అమూల్యమైన విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి అద్భుత విజయాల్లో భాగస్వామ్యలయ్యారు. అయితే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంతో రవిశాస్త్రీతో పాటు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించారు. వీరి స్థానంలో రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రీ.. టీమిండియా కోచ్‌గా తిరిగొస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికకర సమాధానమిచ్చారు.
"టీమిండింయా కోచ్‌గా నా కాలం ముగిసింది. నేను ఏం చేయాలనుకున్నానో.. ఏడేళ్లలో అదే చేశాను. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఏదైనా చేయాలనుకుంటే క్షేత్ర స్థాయి నుంచి మాత్రమే చేస్తాను. అందుకోసం నేను పనిచేస్తున్న సంస్థ ఉంది. అందులో పాల్గొంటాను. లేకంటే కోచ్‌గా నా కాలం ముగిసింది. ఇప్పుడు నేను ఆటను చాలా దూరం నుంచి మాత్రమే చూస్తుున్నాను, ఆనందిస్తున్నాను." అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, రవిశాస్త్రీ కోచ్‌గా టీమిండియాకు అద్భుతమైన విజయాలు వచ్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై భారత్ విజయం సాధించింది. అంతేకాకుండా ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ జట్టుపై 2-1 తేడాతో ఆధిక్యం సాధించింది. అయితే ఈ రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఆ సిరీస్ డ్రాగా ముగిసింది. అయితే అప్పటికే రవిశాస్త్రీ కోచ్‌గా వైదొలిగారు. ఇవి కాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ గ్రూపు దశలోనే ఓడిపోవడంతో రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించారు. అప్పటి నుంచి హిట్ మ్యాన్ కెప్టెన్సీలో భారత్ ఆడుతుంది. రవిశాస్త్రీ కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్