MS Dhoni |ధోని నిర్ణయాన్ని తప్పుబట్టిన రవిశాస్త్రి
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని తప్పుకొని జడేజాకు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం అంతుపట్టడం లేదని అన్నాడు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. ధోని నిర్ణయానికి కారణాలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోని తప్పుకున్నారు. సారథ్య బాధ్యతల్ని జడేజాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్ లో జడేజా కెప్టెన్సీలో చెన్నై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలవ్వడంతో జడేజాపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని ఎందుకు తప్పుకోవాలని అనుకున్నాడో చెప్పాలని టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి డిమాండ్ చేశారు. కొత్త కెప్టెన్ గా జడేజా పేరును చెప్పడానికి గల కారణాల్ని వెల్లడించాలని అతడు పేర్కొన్నారు. జడేజా మంచి ఆటగాడని, కెప్టెన్ బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడని చెప్పాడు. కెప్టెన్ బాధ్యతల్నివద్దుకుంటే ఐపీఎల్ వేలానికి ముందే ధోని తన నిర్ణయాన్ని యాజమాన్యానికి వెల్లడిస్తే బాగుండేదని రవిశాస్త్రి అన్నాడు. అప్పుడు డుప్లెసిస్ లాంటి సీనియర్ ఆటగాడిని చెన్నై వదులుకునేది కాదని పేర్కొన్నాడు. డుప్టెసిస్ ను రీటెయిన్ చేసి కెప్టెన్ గా నియమించి ఉండేదని, ఆటగాడిగా, కెప్టెన్ గా అతడికి ఉన్న అనుభవం టీమ్ ఎంతగానో ఉపయోగపడేందని రవిశాస్త్రి అన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సంబంధిత కథనం
టాపిక్