Rahul Dravid: ఇంతమంది కెప్టెన్లతో పని చేయాల్సి వస్తుందని అనుకోలేదు: ద్రవిడ్‌-rahul dravid talks about working with so many captains in just 8 months period ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid: ఇంతమంది కెప్టెన్లతో పని చేయాల్సి వస్తుందని అనుకోలేదు: ద్రవిడ్‌

Rahul Dravid: ఇంతమంది కెప్టెన్లతో పని చేయాల్సి వస్తుందని అనుకోలేదు: ద్రవిడ్‌

Hari Prasad S HT Telugu
Jun 19, 2022 08:44 PM IST

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టి 8 నెలలు అయింది. అయితే ఈ కాస్త సమయంలోనే టీమిండియాకు ఐదుగురు కెప్టెన్లు మారారు. దీనిపై ద్రవిడ్‌ కాస్త ఫన్నీగా స్పందించాడు.

<p>కోచ్ రాహుల్ ద్రవిడ్</p>
కోచ్ రాహుల్ ద్రవిడ్ (AFP)

బెంగళూరు: టీమిండియా కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకున్న తర్వాత అందరూ ఊహించినట్లే రాహుల్‌ ద్రవిడ్‌ వచ్చాడు. అతని కోచింగ్‌లో సొంతగడ్డపై టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. తర్వాత రెండు గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అయితే చివరి టీ20 మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఐదుగురు కెప్టెన్ల(రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, అజింక్య రహానే, కేఎల్ రాహుల్)తో పని చేయాల్సి రావడంపై ద్రవిడ్‌ స్పందించాడు.

"ఇది కాస్త ఫన్నీగా ఉంది. అదే సమయంలో ఓ సవాలు కూడా. గత 8 నెలలో ఆరుగురు కెప్టెన్లు మారారు. నిజానికి మా ప్లాన్ అది కాదు. కానీ కరోనా మహమ్మారి, మేము ఆడుతున్న మ్యాచ్‌ల సంఖ్య కూడా దీనికి కారణమైంది. టీమ్‌ను, వర్క్‌లోడ్‌ మేనేజ్‌ చేయడం, కెప్టెన్సీలో మార్పులు.. చాలా మందితో పని చేయాల్సి వచ్చింది" అని ద్రవిడ్‌ అన్నాడు.

అయితే టీమ్‌లో లీడర్‌షిప్‌ను ఎంకరేజ్‌ చేసే అవకాశం దీనివల్ల కలిగిందని కూడా ద్రవిడ్‌ చెప్పాడు. "చాలా మంది ప్లేయర్స్‌కు లీడ్‌ చేసే ఛాన్స్‌ రావడం బాగుంది. గ్రూప్‌లో మరింత మంది లీడర్లను తయారు చేసే అవకాశం మాకు దక్కింది. ఓ టీమ్‌గా నిలకడగా నేర్చుకోవడం, మెరుగుపడటం, బాగా ఆడటం చేస్తున్నాం. చాలా మందిని ట్రై చేసే అవకాశం మాకు దక్కింది" అని ద్రవిడ్‌ చెప్పాడు.

"నా 8 నెలల కాలంలో సౌతాఫ్రికా టూర్‌ నిరాశపరిచింది. ఆ సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించినా.. సిరీస్‌ ఓడిపోవడం నిరాశ కలిగించింది. వైట్‌ బాల్‌ క్రికెట్‌ మాత్రం చాలా బాగుంది. ఈ సిరీస్‌లోనూ కొందరు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా మేము పోరాడాము. ఇది మా టీమ్‌ దృక్పథాన్ని, నైపుణ్యాన్ని చూపెడుతోంది" అని ద్రవిడ్‌ అన్నాడు.

Whats_app_banner