Rahul Dravid About Harshal: హర్షల్ పటేల్‌కు ద్రవిడ్ మద్దతు.. మానసికంగా స్ట్రాంగ్ ప్లేయరని కితాబు
Dravid Backed Harshal Patel: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌కు మద్దతుగా మాట్లాడాడు. అతడు అద్భుతమైన బంతులను సంధించినట్లు స్పష్టం చేశాడు.
Rahul Dravid Reaction on Harshal Parel: గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు టీమిండియా పేసర్ హర్షల్ పటేల్. అయితే రీఎంట్రీ తర్వాత హర్షల్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌సలో విఫలమైన హర్షల్‌ను జట్టు యాజమాన్యం పక్కన పెట్టుకుండా మరో ఛాన్స్ ఇచ్చింది. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు అతడికి అవకాశం కల్పించింది. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 2 వికెట్లతో రాణించాడు. దీంతో అతడి ప్రదర్శనపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. హర్షల్ పటేల్ పునరాగమనం తర్వాత మెరుగ్గా రాణించాడని తెలిపాడు.
"హర్షల్ పటేల్ మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి. అతడు అద్భుతమైన క్రికెటర్. గత రెండేళ్ల కాలంలో అతడి పర్ఫార్మెన్స్ చూసుకుంటే అతడు చాలా పురోగతిని సాధించాడు. ఫ్రాంఛైజి క్రికెట్ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు. నాకు తెలిసి అతడు కొన్ని అద్భుతమైన బంతులను సంధించగలడని భావిస్తున్నా. హర్షల్ సన్నాహం కూడా బాగుంది. చాలా కష్టపడుతున్నాడు. గాయాలు పాలవ్వడం సహజమే.. వాటి నుంచి కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది." అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
డెత్ ఓవర్లలో అదిరిపోయే స్పెల్ వేస్తున్నాడని ద్రవిడ్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాపై చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియాలో ప్రమాదకర టిమ్ డేవిడ్ వికెట్ తీసుకున్నాడు. అతడిలో ఈ విధంగా పురోగతి రావడాన్ని మేము బాగా ఆస్వాదిస్తున్నాం. అని ద్రవిడ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్.. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. గువహటి వేదికగా రెండో టీ20 ఆదివారం నాడు జరగనుంది. ఇక మూడోది ఇండోర్ వేదికగా అక్టోబరు 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సిరీస్ తర్వాత ప్రొటీస్ జట్టుతోనే మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఈ సిరీస్ అక్టోబరు నుంచి అక్టోబరు 11 వరకు జరగనుంది.
సంబంధిత కథనం