PKL Season 10 Prize Money: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే.. విజేతకు ఎంతంటే?
PKL Season 10 Prize Money: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మరీ ఈ మెగా లీగ్ ప్రైజ్ మనీ ఎంత? విజేతకు ఎంతిస్తారు? లీగ్ మొత్తం ప్రైజ్ మనీ ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
PKL Season 10 Prize Money: గ్రామీణ క్రీడ కబడ్డీ.. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ద్వారా గ్లోబల్ లెవల్లో పాపులర్ అయింది. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ ఇప్పుడు పదో సీజన్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సీజన్లో ప్రైజ్ మనీ ఎంత అనే వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇండియాలో ఐపీఎల్, పీఎస్ఎల్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న పీకేఎల్లోనూ ప్లేయర్స్ పై కోట్ల వర్షం కురుస్తోంది.
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. రెండున్నర నెలల పాటు ప్రేక్షకులను అలరించనున్న ఈ లీగ్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ముగుస్తుంది. ఈసారి లీగ్ లో మొత్తం 12 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ లీగ్ లో విజేతతోపాటు మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన అన్ని జట్లకూ ప్రైజ్ మనీ ఇస్తారు. ప్లేయర్స్ తోపాటు రిఫరీలకూ ప్రైజ్ మనీ ఉంటుంది.
పీకేఎల్ సీజన్ 10 ప్రైజ్ మనీ ఇలా..
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ.8 కోట్లుగా ఉంది. ఐదో సీజన్ నుంచి ప్రతి సీజన్ లోనూ మొత్తం ప్రైజ్ మనీ ఇంతే ఉంటూ వస్తోంది. ఇందులోనే విన్నర్, రన్నరప్ తోపాటు ఆరోస్థానం వరకూ నిలిచిన జట్లు, ప్లేయర్స్, రిఫరీలకు ప్రైజ్ మనీ అందిస్తారు.
విజేత - రూ.3 కోట్లు
రన్నరప్ - రూ1.8 కోట్లు
మూడు, నాలుగు స్థానాలు - ఒక్కొక్కరికి రూ.90 లక్షలు
ఐదు, ఆరు స్థానాలు - ఒక్కో జట్టుకు రూ.45 లక్షలు
అంటే మొత్తం రూ.8 కోట్ల ప్రైజ్ మనీలో రూ.7.5 కోట్లను టాప్ 6 జట్లకు పంచుతారు. ఇక మిగిలిన రూ.50 లక్షలను వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్స్, రిఫరీలకు అందజేస్తారు.
మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ - రూ.15 లక్షలు
బెస్ట్ రైడర్ - రూ.10 లక్షలు
ఏస్ డిఫెండర్ - రూ. 10 లక్షలు
ఉత్తమ డెబ్యుటెంట్ - రూ.8 లక్షలు
బెస్ట్ రిఫరీ (మేల్ అండ్ ఫిమేల్) - ఒక్కొక్కరికి రూ.3.5 లక్షలు