Pakistan vs New Zealand: న్యూజిలాండ్‌ బ్యాటర్లను కట్టడి చేసిన పాకిస్థాన్‌.. టార్గెట్‌ 153-pakistan vs new zealand semifinal as daryl mitchell and kane williamson give kiwis fighting score ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Vs New Zealand: న్యూజిలాండ్‌ బ్యాటర్లను కట్టడి చేసిన పాకిస్థాన్‌.. టార్గెట్‌ 153

Pakistan vs New Zealand: న్యూజిలాండ్‌ బ్యాటర్లను కట్టడి చేసిన పాకిస్థాన్‌.. టార్గెట్‌ 153

Hari Prasad S HT Telugu
Nov 09, 2022 03:20 PM IST

Pakistan vs New Zealand: న్యూజిలాండ్‌ బ్యాటర్లను కట్టడి చేశారు పాకిస్థాన్‌ బౌలర్లు. షహీన్‌ షా అఫ్రిదితోపాటు మిగతా బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ 152 పరుగులకే పరిమితమైంది.

న్యూజిలాండ్ ను ఆదుకున్న డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ ను ఆదుకున్న డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (AFP)

Pakistan vs New Zealand: టీ20 వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్‌ ముందు 153 రన్స్‌ టార్గెట్‌ ఉంచింది న్యూజిలాండ్‌. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్‌.. పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. స్లో బాల్స్‌తో కివీస్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించారు పాక్‌ బౌలర్లు. దీంతో కివీస్‌ టీమ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 రన్స్ మాత్రమే చేసింది.

డారిల్‌ మిచెల్‌ (53) హాఫ్‌ సెంచరీ చేశాడు. పాకిస్థాన్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది 4 ఓవర్లలో 24 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. తొలి బంతికే ఫోర్‌ కొట్టి ఫిన్‌ అలెన్‌ (4) మూడో బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కాసేపటికే మరో ఓపెనర్‌ డెవోన్‌ కాన్వే (21) కూడా రనౌటయ్యాడు. టాప్‌ ఫామ్‌లో ఉన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ (6) కూడా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ 49 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌ టీమ్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 68 రన్స్‌ జోడించారు. విలియమ్సన్‌ 42 బాల్స్‌లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 46 రన్స్‌ చేశాడు. అయితే డారిల్‌ మిచెల్‌ మాత్రం చివరి బంతి వరకూ క్రీజులో ఉన్నాడు. అతడు చివరికి 35 బాల్స్‌లో 53 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.

Whats_app_banner