Nikhat Zareen: కామన్వెల్త్ గేమ్స్ క్లోజింగ్ సెర్మనీలో ఫ్లాగ్‌బేరర్లుగా నిఖత్, శరత్
Nikhat Zareen: కామన్వెల్త్ గేమ్స్ సోమవారం (ఆగస్ట్ 8)తో ముగుస్తున్నాయి. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఈ గేమ్స్ క్లోజింగ్ సెర్మనీ జరగబోతోంది.
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ 2022ను ఇండియా ఘనంగా ముగించింది. ఈసారి మొత్తం 61 మెడల్స్‌తో 4వ స్థానంలో నిలిచింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ ఉండగా.. చివరి రోజైన సోమవారమే నాలుగు పసిడి పతకాలు వచ్చాయి. అందులో మూడు బ్యాడ్మింటన్ కాగా.. ఒకటి టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ సాధించాడు. ఇక ఈ సారి గేమ్స్ క్లోజింగ్ సెర్మనీకి సిద్ధమవుతోంది.
భారత కాలమానం ప్రకారం కామన్వెల్త్ గేమ్స్ క్లోజింగ్ సెర్మనీ సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో ఇండియా ఫ్లాగ్ బేరర్లుగా బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ ఉండనున్నారు. నిఖత్ ఆదివారం జరిగిన 50 కేజీల ఫైనల్లో గోల్డ్ గెలవగా.. శరత్ కమల్ సోమవారం టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఈ ఇద్దరినీ ఫ్లాగ్‌బేరర్లుగా నియమిస్తున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు అనిల్ ఖన్నా చెప్పారు. ఈ ఇద్దరూ ఇండియన్ స్పోర్ట్స్‌కు అందించిన సేవలను కొనియాడుతూ.. ఈ అరుదైన అవకాశాన్ని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ టీమ్స్ ఇండియాకు తిరిగి వచ్చేయడంతో క్లోజింగ్ సెర్మనీలో ఫ్లాగ్ బేరర్ అవకాశం వీళ్లను వరించింది.
ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, అథ్లెటిక్స్‌లలో ఇండియా ఎక్కువగా మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను మొదలుపెట్టిన గోల్డ్ మెడల్ వేటను చివరి రోజు బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్ ముగించారు. ఈసారి ఇండియా మొత్తం 22 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకుంది.
సంబంధిత కథనం