Ks Bharat Trolls: కేఎస్ భరత్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు - యూకే అనుకొని ఉత్తరాఖండ్ వెళ్లాడంటూ ఫన్నీ కామెంట్స్
Ks Bharat Trolls: టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. యూకే అనుకొని పొరపాటుగా ఉత్తరాఖండ్ వెళ్లాడంటూ అతడిపై ఫన్నీ కామెంట్స్ చేస్తోన్నారు.
Ks Bharat Trolls: టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్‌తో అతడిని ట్రోల్ చేస్తోన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇటీవలే ఇంగ్లాండ్ వెళ్లాడు భరత్. ఫైనల్ కోసం ప్రకటించిన టీమ్ ఇండియా జట్టులో వికెట్ కీపర్ స్థానంలో భరత్‌కు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. కానీ తుది జట్టులో అతడికి చోటు దక్కడం అనుమానంగా మారింది. భరత్‌తో పాటు మరో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ కీపర్‌గా భరత్ కంటే ఇషాన్ కిషన్‌వైపే ఇండియా మేనేజ్‌మంట్ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు కూడా భరత్ కంటే ఇషాన్ కిషన్‌ను ఆడించడమే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తోన్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ బయలుదేరిన ఫొటోను ఇటీవల సోషల్ మీడియాలో భరత్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోను ఉద్దేశిస్తూ యూకే వెళ్లాల్సిన భరత్ పొరపాటుగా ఉత్తరాఖండ్ వెళ్లడంతో అతడికి బదులుగా ఇషాన్ కిషన్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాడని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.
అతడికి కామెంట్‌కు ఇది నిజమైతే బాగుండునని మరో నెటిజన్ పేర్కొన్నాడు. భరత్ ఇదే లాస్ట్ ఛాన్స్, ఈ సారి ఆడకపోతే టీమ్ ఇండియా నుంచి ఉద్వాసన తప్పదంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు భరత్. కానీ తుది జట్టులో ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి అవకాశం దక్కలేదు. మరోవైపు గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లోనూ భరత్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.