Mohammed Siraj: సిరాజ్ ఏం పాపం చేశాడు - బీసీసీఐ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్-netizens fire on bcci for not selecting siraj in australia t20i series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mohammed Siraj: సిరాజ్ ఏం పాపం చేశాడు - బీసీసీఐ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్

Mohammed Siraj: సిరాజ్ ఏం పాపం చేశాడు - బీసీసీఐ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 03:24 PM IST

Mohammed Siraj: ఈ నెల 20 నుంచి స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది టీమ్ ఇండియా. ఈ సిరీస్‌కు ముందు కొవిడ్ కార‌ణంగా మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ టీమ్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో ఉమేష్ యాద‌వ్‌ను ఎంపిక‌చేశారు. సిరాజ్‌ను కాద‌ని ఉమేష్‌ను ఎంపిక‌చేయ‌డంపై నెటిజ‌న్లుపై బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.

మహ్మద్ సిరాజ్
మహ్మద్ సిరాజ్ (twitter)

Mohammed Siraj: చక్కటి స్వింగ్ బౌలింగ్ తో గత రెండు, మూడు ఏళ్లుగా మూడు ఫార్మెట్స్ లో ప్రతిభను చాటుకున్నాడు పేసర్ మహ్మద్ సిరాజ్. కానీ ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత అతడి పరిస్థితి మొత్తం తలక్రిందులైంది. ఈ సీజన్ లో సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ వెలుగులోకి రావడంతో సిరాజ్ ను పక్కనపెట్టారు సెలెక్టర్లు.

జింబాబ్వే, ఐర్లాండ్ తో పాటు పలు సిరీస్ లకు అతడిని ఎంపిక చేయలేదు. అంతేకాకుండా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ ల‌కు సిరాజ్ పేరును కనీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ కు కొవిడ్ కార‌ణంగా పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో ఉమేష్ యాద‌వ్ ను ఎంపిక‌చేశారు. ఉమేష్ యాద‌వ్ జాతీయ జ‌ట్టుకు ఆడి చాలా కాల‌మైంది. దాదాపు రెండేళ్ల క్రితం టీమ్ ఇండియా త‌ర‌ఫున టీ20 మ్యాచ్ ఆడాడు.

అనూహ్యంగా అత‌డిని ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సిరాజ్‌ను కాద‌ని ఉమేష్‌కు స్థానం క‌ల్పించ‌డంపై నెటిజ‌న్లు బీసీసీఐ పై ఫైర్ అవుతున్నారు. సిరాజ్‌ను కావాల‌నే ప‌క్క‌న‌పెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ష‌మీ స్థానంలో సిరాజ్ బెట‌ర్ ఆప్ష‌న్ అని సూచిస్తున్నారు. సిరాజ్ ఏం పాపం చేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

విరాట్ కెప్టెన్ గా ఉన్న సమయంలో సిరాజ్ ను ఎంకరేజ్ చేశాడని, కానీ రోహిత్ మాత్రం అతడిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మొద‌లుకానుంది.

WhatsApp channel