MS Dhoni: ఇంటికి మేకలు తీసుకొచ్చిన ధోనీ.. వీడియో షేర్‌ చేసిన సాక్షి-ms dhoni brought goats to his home wife sakshi shares the video ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ms Dhoni Brought Goats To His Home Wife Sakshi Shares The Video

MS Dhoni: ఇంటికి మేకలు తీసుకొచ్చిన ధోనీ.. వీడియో షేర్‌ చేసిన సాక్షి

Hari Prasad S HT Telugu
Jun 13, 2022 09:18 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ తన రిటైర్మెంట్‌ జీవితాన్ని హాయిగా గడిపేస్తున్నాడు. జంతువులన్నా, వ్యవసాయం అన్నా ఇష్టపడే ఈ మిస్టర్‌ కూల్‌.. ఇప్పుడు వాటితోనే టైంపాస్‌ చేస్తున్నాడు.

ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ (HT_PRINT)

ధోనీ ఓ చిత్రమైన మనిషి. క్రికెట్‌ ఫీల్డ్‌లోనే కాదు బయట కూడా అతడు చేసే పనులు ఎవరికీ అంతుబట్టవు. ఎవరేమనుకున్నా తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. తనకు ఇష్టమైన పనులు చేయడానికి ఏమాత్రం మొహమాటపడడు. అతనికి జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే అతని ఇంట్లో చాలా పెంపుడు జంతువులే కనిపిస్తాయి. గుర్రాలు, కుక్కలు, చిలుకలు, పిల్లులు ఇలా.. రకారకాల జంతువులను పెంచుకుంటూ ఉంటాడు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ఈ లిస్ట్‌లో మేకలు కూడా చేరాయి. ధోనీ ఇంటికి రెండు మేకలు తీసుకొచ్చాడంటూ అతని భార్య సాక్షి ధోనీ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సమ్‌బడీ లవ్స్‌ యూ అనే సాంగ్‌తో ఆమె ఈ మేకల వీడియోనును షేర్‌ చేయడం విశేషం. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. GOAT (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) ఇంట్లో మొత్తానికి గోట్స్‌ వచ్చాయంటూ చాలా మంది యూజర్లు కామెంట్‌ చేశారు.

గతంలో ధోనీ తన ఇంట్లో ఉన్న గుర్రం వీడియోను కూడా షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దాంతో కలిసి ధోనీ పరుగెత్తుతూ ఉంటాడు. ఇక తన కూతురు జివా బర్త్‌డే సందర్భంగా ఆమెకు కూడా మరో చిన్న గుర్రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇవే కాకుండా ధోనీ కడక్‌నాథ్‌ కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నాడు. దీనికోసం ఈ మధ్యే అతడు పెద్ద ఎత్తున ఈ కోళ్ల కోసం ఆర్డర్‌ ఇచ్చాడు.

ధోనీ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నా.. సాక్షి ధోనీ మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దీంతో ధోనీ ఫ్యాన్స్‌ అంతా సాక్షి ఇన్‌స్టా అకౌంట్‌ను ఫాలో అవుతుంటారు. ఇక ధోనీ కెరీర్‌ విషయానికి వస్తే ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్న అతడు.. వచ్చే సీజన్‌లోనే మరోసారి ఫీల్డ్‌లో కనిపించనున్నాడు.

WhatsApp channel