Misbah ul Haq on PCB: పాకిస్థాన్ క్రికెట్‌కు సిగ్గుచేటు.. పీసీబీ ఆన్‌లైన్ కోచ్ నిర్ణయంపై పాక్ మాజీ కోచ్ సీరియస్-misbah ul haq on pcb says its a slap on pakistan cricket over online coach news ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Misbah Ul Haq On Pcb Says Its A Slap On Pakistan Cricket Over Online Coach News

Misbah ul Haq on PCB: పాకిస్థాన్ క్రికెట్‌కు సిగ్గుచేటు.. పీసీబీ ఆన్‌లైన్ కోచ్ నిర్ణయంపై పాక్ మాజీ కోచ్ సీరియస్

Hari Prasad S HT Telugu
Feb 02, 2023 02:21 PM IST

Misbah ul Haq on PCB: పాకిస్థాన్ క్రికెట్‌కు సిగ్గుచేటు అంటూ పీసీబీ ఆన్‌లైన్ కోచ్ నిర్ణయంపై పాక్ మాజీ కోచ్ మిస్బావుల్ హక్ తీవ్రంగా మండిపడ్డాడు. పాకిస్థాన్‌ను ఓ సెకండ్ ఆప్షన్ గా చూస్తున్న వ్యక్తికి కోచ్ పదవి ఇవ్వాలన్న ఆలోచనపై అతడు ఇలా స్పందించాడు.

మిస్బావుల్ హక్
మిస్బావుల్ హక్

Misbah ul Haq on PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త కోచ్ కోసం చూస్తున్న విషయం తెలిసిందే. గతంలో టీమ్ కు కోచ్ గా ఉన్న మిక్కీ ఆర్థర్ నే మరోసారి తీసుకురావాలని బోర్డు ఛైర్మన్ నజమ్ సేఠీ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే డెర్బీషైర్ కోచ్ గా ఉన్న ఆర్థర్.. పూర్తిస్థాయిలో పాకిస్థాన్ కు రాకుండా ఆన్ లైన్ కోచింగ్ వరకూ ఓకే అంటున్నాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల సమయంలోనే నేరుగా టీమ్ దగ్గరికి వస్తానని చెబుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

అయినా సరే పీసీబీ అతనికే కోచింగ్ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అయిన మిస్బావుల్ హక్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇది పాకిస్థాన్ క్రికెట్ కు చెంప పెట్టులాంటిదని అతడు అన్నాడు. ఓ హై ప్రొఫైల్ ఫుల్ టైమ్ కోచ్ కూడా మీకు దొరకడం లేదా అని మిస్బా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

"మన క్రికెట్ వ్యవస్థకు ఇది చెంప పెట్టులాంటిది. మనం కనీసం ఓ హై ప్రొఫైల్ ఫుల్ టైమ్ కోచ్ ను కనుగొనలేకపోతున్నాం. మంచి కోచ్ లు రావడానికి ఆసక్తి చూపకపోవడం, పాకిస్థాన్ ను రెండో ఆప్షన్ గా చూస్తున్న వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలనుకోవడం సిగ్గు చేటు. దీనికి మన వ్యవస్థే కారణం. ఇందులో చాలా బలహీనతలు ఉన్నాయి. మన సొంత వ్యక్తులనే అగౌరవపరిచినందుకు మనల్ని మనం నిందించుకోవాలి.

ఇప్పటి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు పడదు. మాజీలు తమ రేటింగ్స్ కోసం యూట్యూబ్ ఛానెల్స్ ను ఉపయోగించుకుంటున్నారు. ఇది మన క్రికెట్ విశ్వసనీయతను దెబ్బతీసి, మనం అసమర్థులం అన్న ముద్ర వేసేలా చేస్తోంది" అని క్రికిన్ఫోతో మాట్లాడుతూ మిస్బా ఆవేదన వ్యక్తం చేశాడు.

"పాకిస్థాన్ క్రికెట్ అభిమాని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటున్నాడు. అతడు మీడియా నుంచి వార్తలు తెలుసుకొని తప్పుడు అభిప్రాయంతో ఉంటున్నాడు. ప్లేయర్స్ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇది మన క్రికెట్ ను తక్కువ చేస్తోంది. మన క్రికెట్ ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటోంది" అని మిస్బా అన్నాడు.

"దేశంలో క్రికెట్ చాలా ఆదరణ ఉన్న ఆట. కానీ ఎప్పుడూ సరైన కారణాలతో వార్తల్లో నిలవడం లేదు. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ క్రికెటర్లు సహచర క్రికెటర్లను నేషనల్ ఛానెళ్లలోనే తిడుతున్నారు. ఇది అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. అసలు గౌరవమే లేదు" అని మిస్బా ఆవేదన వ్యక్తం చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్