CSK vs KKR: ర‌హానే, దూబే ఊచ‌కోత - కోల్‌క‌తాను చిత్తు చేసిన చెన్నై-rahane dube helps as csk beat kkr by 49 runs ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Vs Kkr: ర‌హానే, దూబే ఊచ‌కోత - కోల్‌క‌తాను చిత్తు చేసిన చెన్నై

CSK vs KKR: ర‌హానే, దూబే ఊచ‌కోత - కోల్‌క‌తాను చిత్తు చేసిన చెన్నై

Nelki Naresh Kumar HT Telugu
Apr 24, 2023 06:31 AM IST

CSK vs KKR: కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ 49 ప‌రుగులు తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ర‌హానే, దూబే బ్యాటింగ్ మెరుపుల‌తో చెన్నై 235 ర‌న్స్ చేయ‌గా ల‌క్ష్య‌ఛేద‌న‌లో కోల్‌క‌తా త‌డ‌బ‌డింది.

 ర‌హానే
ర‌హానే

CSK vs KKR: ఐపీఎల్ 2023లో చెన్నై వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ర‌హానే, దూబే బ్యాటింగ్ విధ్వంసంతో ఆదివారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై 49 ప‌రుగుల తేడాతో చెన్నై అద్భుత‌ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. ఐపీఎల్‌లో హ‌య్యెస్ట్ ఛేజింగ్ కావ‌డంతో ఆరంభంలోనే కోల్‌క‌తా చేతులెత్తేసింది.

సింగిల్ ర‌న్‌కే ఓపెన‌ర్లు జ‌గ‌దీష‌న్‌, సునీల్ న‌రైన్ వికెట్ల‌ను కోల్పోయింది. వెంక‌టేష్ అయ్య‌ర్‌(20 బాల్స్‌లో 20 ర‌న్స్‌), కెప్టెన్ నితీష్ రానా (20 బాల్స్‌లో 27 ర‌న్స్‌) నెమ్మ‌దిగా ఆడ‌టంతో కోల్‌క‌తా ఓట‌మి ఖ‌రారైంది. ఈ త‌రుణంలో జేస‌న్ రాయ్‌, రింకు సింగ్ ఎదురుదాడికి దిగారు.

సిక్స‌ర్ల‌తో కోల్‌క‌తాను గెలుపు రేసులోకి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో 19 బాల్స్‌లోనే జేస‌న్ రాయ్ హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. దూకుడుగా ఉన్న అత‌డిని తీక్ష‌ణ ఔట్ చేశాడు. 26 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 61 ర‌న్స్ చేశాడు జేస‌న్ రాయ్‌. మ‌రోవైపు రింకు సింగ్ 33 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, 3 ఫోర్ల‌తో 53 ర‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. కానీ సాధించాల్సిన ర‌న్‌రేట్ ఎక్కువ‌గా ఉండ‌టంతో వీరి మెరుపులు స‌రిపోలేదు.

చివ‌ర‌కు 20 ఓవ‌ర్ల‌లో 186 ర‌న్స్ వ‌ద్ద కోల్‌క‌తా క‌థ ముగిసింది. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే, తీక్ష‌ణ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. అంత‌కుముందు చెన్నైకి ర‌హానే, దూబే, కాన్వే క‌లిసి భారీ స్కోరు అందించారు.

ముఖ్యంగా ర‌హానే కేవ‌లం 29 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 71 ర‌న్స్ చేశాడు. కాన్వే 40 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు నాలుగు ఫోర్ల‌తో 56 ర‌న్స్‌, శివ‌మ్ దూబే 21 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 50 ర‌న్స్‌తో మెరుపులు మెరిపించ‌డంతో చెన్నై 235 ర‌న్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్స్ ప‌ద్దెనిమిది సిక్స‌ర్లు కొట్ట‌గా...కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్స్ 12 కొట్టారు.

WhatsApp channel