KKR vs RCB: నా యాస నితీష్‌కు అర్థం కానట్లుంది.. టాస్ గందరగోళంపై డుప్లెస్సి క్లారిటీ-kkr vs rcb at eden gardens as some chaos at the time of toss leaves nitish rana unhappy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Rcb: నా యాస నితీష్‌కు అర్థం కానట్లుంది.. టాస్ గందరగోళంపై డుప్లెస్సి క్లారిటీ

KKR vs RCB: నా యాస నితీష్‌కు అర్థం కానట్లుంది.. టాస్ గందరగోళంపై డుప్లెస్సి క్లారిటీ

Hari Prasad S HT Telugu
Apr 06, 2023 09:08 PM IST

KKR vs RCB: నా యాస నితీష్‌కు అర్థం కానట్లుంది అంటూ టాస్ గందరగోళంపై డుప్లెస్సి క్లారిటీ ఇచ్చాడు. కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ లో టాస్ సమయంలో కాస్త అయోమయం నెలకొంది. దీనిపై కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా అసహనం వ్యక్తం చేశాడు.

కేకేఆర్, ఆర్సీబీ కెప్టెన్లు నితీష్ రాణా, డుప్లెస్సి
కేకేఆర్, ఆర్సీబీ కెప్టెన్లు నితీష్ రాణా, డుప్లెస్సి (Royal Challengers Bangalore Twit)

KKR vs RCB: ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి యాస అర్థం కాక కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా అయోమయానికి గురయ్యాడు.

అయితే దీనిపై తర్వాత డుప్లెస్సి క్లారిటీ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. టాస్ సందర్భంగా హోస్ట్ టీమ్ కెప్టెన్ అయిన నితీష్ రాణా కాయిన్ గాల్లోకి ఎగరేశాడు. ఆ సమయంలో డుప్లెస్సి హెడ్స్ అని అన్నాడు. కాయిన్ హెడ్స్ పడింది. అయితే మ్యాచ్ రిఫరీతోపాటు నితీష్ రాణా కూడా డుప్లెస్సి టెయిల్స్ అన్నాడనుకొని టాస్ కేకేఆర్ గెలిచినట్లు భావించారు.

కానీ తాను హెడ్స్ అన్నానని డుప్లెస్సి చెప్పాడు. ఆ సమయంలో టాస్ నిర్వహిస్తున్న సంజయ్ మంజ్రేకర్ కూడా ఫాఫ్.. హెడ్స్ అన్నాడని స్పష్టం చేశాడు. దీనిపై నితీష్ అసహనం వ్యక్తం చేస్తూ పక్కకెళ్లిపోయాడు. ఇది నీకు ఓకే కదా అని మంజ్రేకర్ అడిగినా అతడు పట్టించుకోలేదు. దీనిపై డుప్లెస్సి వివరణ ఇచ్చాడు. "మొదట బౌలింగ్ చేస్తాం. నా యాస అర్థం కాక కాస్త తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు" అని డుప్లెస్సి చెప్పాడు.

అయితే ఈ నిర్ణయంపై నితీష్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ కు ఆర్సీబీ ఒక మార్పు చేసింది. గాయపడిన టోప్లీ స్థానంలో డేవిడ్ విల్లీని తుది జట్టులోకి తీసుకుంది. టాస్ గెలిచి ఉంటే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని నితీష్ రాణా కూడా చెప్పాడు. రాత్రి పూట మంచు కారణంగా టాస్ గెలిచిన టీమ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం