Ipl Today Shedule: ఐపీఎల్‌లో నేడు డ‌బుల్ ధ‌మాకా - పంజాబ్‌తో కోల్‌క‌తా పోరు - ఢిల్లీ తో ల‌క్నో ఢీ-ipl today schedule kkr vs pbks lsg vs dc match prediction playing xi details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Today Shedule: ఐపీఎల్‌లో నేడు డ‌బుల్ ధ‌మాకా - పంజాబ్‌తో కోల్‌క‌తా పోరు - ఢిల్లీ తో ల‌క్నో ఢీ

Ipl Today Shedule: ఐపీఎల్‌లో నేడు డ‌బుల్ ధ‌మాకా - పంజాబ్‌తో కోల్‌క‌తా పోరు - ఢిల్లీ తో ల‌క్నో ఢీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 01, 2023 09:04 AM IST

Ipl Today Shedule: ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. మ‌రో మ్యాచ్‌ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రుగ‌నుంది.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్‌
కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్‌

Ipl Today Shedule: ఐపీఎల్‌లో శ‌నివార రెండు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో స‌మ‌రానికి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ సిద్ధ‌మైంది. కొత్త కెప్టెన్ నితీష్ రానా సార‌థ్యంలో నేడు తొలి మ్యాచ్ ఆడ‌నుంది కోల్‌క‌తా. విండీస్‌ హిట్ట‌ర్లు ఆంద్రీ ర‌సెల్‌, సునీల్ న‌రైన్‌పైనే కోల్‌క‌తా ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు.

వీరితో పాటు వెంక‌టేష్ అయ్య‌ర్‌, రింకుసింగ్‌, ర‌హ‌మ‌తుల్లా గుర్భాజ్ బ్యాటింగ్ ప‌రంగా కోల్‌క‌తాకు కీల‌కం కానున్నారు. బౌలింగ్‌లో ఉమేష్ యాద‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిల‌కు తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం ఖాయ‌మే వారితో పాటు లూకీ ఫెర్గ్యూస‌న్ ఎంపిక‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

మ‌రోవైపు పంజాబ్ కింగ్స్ సీనియ‌ర్ ప్లేయ‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలో తొలి మ్యాచ్‌లోనే విజ‌యాన్ని అందుకోవాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. ఆల్ రౌండ‌ర్లు రాజ‌ప‌క్స‌, సికింద‌ర్ ర‌జా, షార్ట్ రాణించ‌డంపైనే పంజాబ్ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి. రంజీలో రాణించిన షారుఖ్‌ఖాన్‌కు తుది జ‌ట్టులో స్థానం ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. బౌలింగ్ పరంగా పంజాబ్‌కు అర్ష‌దీప్‌సింగ్ కీల‌కంగా నిల‌వ‌బోతున్నాడు.

కేఎల్ రాహుల్‌కు ప‌రీక్ష‌

మ‌రో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది. ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఈ మ్యాచ్ ప‌రీక్ష‌గా మారింది. గ‌త కొంత‌కాలంగా ఫామ్ లేమీతో ఇబ్బందులు ప‌డుతోన్న రాహుల్ తొలి మ్యాచ్ ద్వారా త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు ఏ మేర‌కు బ‌దులిస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రాహుల్‌తో పాటు కైల్ మేయ‌ర్స్‌, నికోల‌స్ పూర‌న్ వంటి హిట్ట‌ర్లు, దీప‌క్ హుడా, స్టోయినిస్‌, కృనాల్ పాండ్య వంటి ఆల్ రౌండ‌ర్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్‌ ప‌టిష్టంగా ఉంది.

ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో నికోల‌స్ పూర‌న్‌ను 16 కోట్ల‌కు ల‌క్నో ద‌క్కించుకున్న‌ది. త‌న ధ‌ర‌కు అత‌డు ఏ విధంగా న్యాయం చేస్తాడోన‌ని క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. బౌలింగ్‌లో జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్‌, ఆవేష్‌ఖాన్ రాణిస్తే ఢిల్లీకి క‌ష్టాలు త‌ప్ప‌వు.

మ‌రోవైపు గాయంతో రిష‌బ్ పంత్ ఐపీఎల్ మొత్తానికి దూరం కావ‌డం ఢిల్లీని దెబ్బ‌తీసింది. పంత్ స్థానంలో వార్న‌ర్ కెప్టెన్‌గా బాధ్య‌త‌ల్ని స్వీక‌రించాడు. అత‌డిపైనే ఢిల్లీ భారం ఉంది. దేశ‌వాళీ క్రికెట్‌లో రాణించిన పృథ్వీషా, స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించాల‌నే ఉత్సాహంతో ఉన్నారు. స్పిన్ ద్వ‌యం అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్ ల‌క్నోను క‌ట్ట‌డి చేసే అవ‌కాశం ఉంది.

WhatsApp channel

టాపిక్