Ravindra Jadeja : చెన్నై నుంచి జడేజా తప్పుకొంటాడా? జడ్డూపై ఈ 3 జట్లు ఫోకస్
IPL 2024 Ravindra Jadeja : ఐపీఎల్ స్టార్ ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒకరు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంగా ఆడుతున్న జడేజా కూడా జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డాడు. అయితే ఈ ఎడిషన్‌లో రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మధ్య అంతా బాగాలేదని మరోసారి పుకార్లు వచ్చాయి.
సీఎస్‌కే జట్టులోని పలు సమస్యలతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అసంతృప్తిని పదే పదే అభిమానుల ముందు వ్యక్తం చేశాడు. GTతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించిన తర్వాత ధోనీతో జడేజాకు కొన్ని చర్చలు జరిగాయని అంటున్నారు. అంతేకాదు.. CSK CEO కాశీ విశ్వనాథన్.. జడేజాకు తీవ్రమైన విషయం వివరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటీవలి రోజుల్లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చేసిన కొన్ని ట్వీట్లు కూడా ఈ వార్తలకు మద్దతుగా ఉన్నాయి. చెన్నై జట్టులో జడేజా సంతృప్తికరంగా లేడని ఎప్పటినుంచో చాలా మంది అనుకుంటున్నారు.
ఈ కారణాలన్నింటి కారణంగా రవీంద్ర జడేజా సీఎస్‌కే జట్టు(CSK Team) నుంచి తప్పుకుంటాడా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. గత ఎడిషన్‌లోనూ జడ్డూ, ధోనీ, మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు భారీగానే ఉన్నాయి. అయినా జడేజా ఈ ఎడిషన్‌లో CSK జట్టులో కొనసాగాడు. వచ్చే ఎడిషన్ కంటే ముందే జడేజా వేలం జాబితాలోకి చేరితే.. అంత నాణ్యమైన ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఇతర జట్లు పోటీపడడం సహజమే. ఓ మూడు జట్లు జడేజాపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఎడిషన్‌లో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించే సత్తా ఉన్న జడేజాను లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ కూడా జడ్డూ మీద ఆసక్తి చూపిస్తుంది. రవీంద్ర జడేజా లాంటి ఆటగాడు కోసం ముంబై ఇండియన్స్ ఎదురుచూస్తోంది. జడేజా జట్టులోకి వస్తే జట్టు బ్యాలెన్స్ మెరుగ్గా ఉంటుందనేది నిజం. తదుపరి ఎడిషన్‌లో రవీంద్ర జడేజాను కొనుగోలు చేసే అవకాశం వస్తే ముంబై ఇండియన్స్ ఆ అవకాశాన్ని వదులుకోలేరన్నది నిజం.