IND vs NZ First T20: వ‌ర్షం కార‌ణంగా ఇండియా, న్యూజిలాండ్ తొలి టీ20 ర‌ద్దు-india vs new zealand first t20 match abandoned due to rain ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Vs New Zealand First T20 Match Abandoned Due To Rain

IND vs NZ First T20: వ‌ర్షం కార‌ణంగా ఇండియా, న్యూజిలాండ్ తొలి టీ20 ర‌ద్దు

Nelki Naresh Kumar HT Telugu
Nov 18, 2022 01:52 PM IST

IND vs NZ First T20: ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ధ‌యింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌దుప‌రి మ్యాచ్ ఆదివారం జ‌రుగ‌నుంది.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

IND vs NZ First T20: వెల్లింగ్‌ట‌న్ వేదిక‌గా నేడు ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ధ‌యింది. ఏక‌ధాటిగా వ‌ర్షం కుర‌వ‌డంతో తొలుత టాస్ ఆల‌స్యం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

కానీ వ‌ర్షం త‌గ్గే సూచ‌న‌లు త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జ‌రుగ‌నుంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ విశ్రాంతి కార‌ణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూర‌మ‌య్యాడు.

అత‌డి స్థానంలో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. ఈ టీ20 సిరీస్ కోసం ఓపెన‌ర్లుగా ఇషాన్ కిష‌న్‌, శుభ్‌మ‌న్‌గిల్‌ల‌ను ఎంపిక‌చేశారు.

WhatsApp channel