India in Women's Asia Cup Final: ఆసియాకప్ లీగ్ స్టేజ్‌లో ఆరు మ్యాచ్‌లలో 5 విజయాలతో టాప్‌లో నిలిచిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. సెమీఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించింది. థాయ్‌లాండ్‌తో గురువారం (అక్టోబర్ 13) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 74 రన్స్ తేడాతో సులువుగా విజయం సాధించింది. 149 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన థాయ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 రన్స్ మాత్రమే చేయగలిగింది.,దీప్తి శర్మ మరోసారి చెలరేగింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 7 రన్స్ 3 వికెట్లు తీసుకుంది. ఆమె దెబ్బకు థాయ్ టీమ్ టాపార్డర్ 18 పరుగులకే పెవిలియన్ చేరింది. మరో స్పిన్నర్ రాజేశ్వర్ గైక్వాడ్ కూడా 4 ఓవర్లలో కేవలం 10 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇక రేణుక, స్నేహ్, షెఫాలీ తలా ఒక వికెట్ తీశారు. పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో ఇండియా తలపడనుంది.,అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్ టీమ్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 రన్స్ చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 28 బాల్స్‌లోనే 42 రన్స్ చేసింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బాల్స్‌లో 36 రన్స్ చేయగా.. జెమీమా 26 బాల్స్‌లో 27 రన్స్ చేసింది. చివర్లో పూజా వస్త్రకర్ 13 బాల్స్‌లో 14 రన్స్ చేయడంతో ఇండియా ఫైటింగ్ స్కోరు సాధించింది. సెమీస్‌లోనూ ఓపెనర్ స్మృతి మంధానా (13) మరోసారి నిరాశపరిచింది.