IND VS WI Rohit Record : వరుసగా 30వ సారి.. టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ మెునగాడు
IND VS WI Rohit Record : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్టులో ఎన్నో రికార్డులు బద్ధలవుతున్నాయి. రోహిత్ శర్మ కూడా వ్యక్తిగత రికార్డులు లిఖించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వరుసగా 30వ సారి రెండంకెల స్కోరును దాటిన రోహిత్ శర్మ(Rohit Sharma).. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును లిఖించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో భారత్-వెస్టిండీస్(IND Vs WI) మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు నాలుగో రోజున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ హాఫ్ సెంచరీతో టెస్ట్ ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
రెండో టెస్టులో రోహిత్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం అతని టెస్ట్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైనది. అలాగే, టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన 6వ భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. దీంతో పాటు అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వరుసగా 30వ సారి రెండంకెల స్కోరును దాటిన రోహిత్ శర్మ.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును లిఖించిన మెుదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
గత 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ చేసిన పరుగులను పరిశీలిస్తే.. 12, 161, 26, 66, 25, 49, 34, 30, 36, 12, 83, 21, 19, 59, 11, 127, 22, 31, 31, 31, 31, 31, 31, , 43, 103, 80, 57గా ఉన్నాయి. గతంలో టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా 29 ఇన్నింగ్స్‌ల్లో 10కి పైగా పరుగులు చేసిన రికార్డు శ్రీలంక దిగ్గజం జయవర్ధనే పేరిట ఉండేది. ఇప్పుడు రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఎక్కువ సార్లు రెండంకెల స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌లను పరిశీలిస్తే..
రోహిత్ శర్మ - 30, జయవర్ధనే - 29, లెన్ హట్టన్ - 25, రోహన్ కన్హై- 25, ఏబీ డివిలియర్స్ - 24 సార్లు టాప్ లో ఉన్నారు. తాజాగా రోహిత్ శర్మ మెుదటి స్థానంలోకి వచ్చాడు.
రెండో టెస్టులో టీమిండియా(Team India) మరో రికార్డును లిఖించింది. జైస్వాల్-రోహిత్ భాగస్వామ్యం(Jaiswal-Rohit Sharma Partnership) తొలి ఓవర్‌లోనే యాక్షన్‌ను ప్రారంభించింది. జైస్వాల్ మెుదటి ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక బౌండరీ బాదాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ గేమ్‌లో రెచ్చిపోయాడు. ప్రతి ఓవర్‌లోనూ సిక్స్‌లు, ఫోర్లు బాదుతూనే ఉన్నాడు. దీంతో భారత జట్టు 5.3 ఓవర్లలో 50 పరుగులకు చేరుకుంది. అలాగే, టెస్టు చరిత్రలో భారత జట్టు అత్యంత వేగంగా 50 పరుగుల రికార్డును సృష్టించింది.