R Ashwin Records : తిప్పేసిన అశ్విన్.. ఈ 6 రికార్డులూ సొంతం-ind vs wi 1st test ravichandran ashwin records in 1st test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  R Ashwin Records : తిప్పేసిన అశ్విన్.. ఈ 6 రికార్డులూ సొంతం

R Ashwin Records : తిప్పేసిన అశ్విన్.. ఈ 6 రికార్డులూ సొంతం

Anand Sai HT Telugu
Jul 15, 2023 09:48 AM IST

IND vs WI 1st Test : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 24.3 ఓవర్లలో కేవలం 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు అశ్విన్. రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో పలు రికార్డులను సృష్టించాడు.

అశ్విన్ రికార్డులు
అశ్విన్ రికార్డులు (BCCI)

తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఏకపక్షంగా ఓడించిన భారత్.. టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. డొమినికా టెస్టులో వెస్టిండీస్‌పై భారత్(WI Vs IND) ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. కేవలం మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ మరియు 141 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు చేయగా.., భారత్ 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కరీబియన్‌ జట్టుకు కంటగింపుగా నిలిచిన ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌ అశ్విన్‌(R Ashwin) రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్‌ను కేవలం 130 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 24.3 ఓవర్లలో కేవలం 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.

వెస్టిండీస్‌లో ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఆర్‌ అశ్విన్ నిలిచాడు.

ఆర్ అశ్విన్ 23వ సారి టెస్టు మ్యాచ్‌లో చివరి వికెట్ తీసి ప్రపంచ రికార్డులో షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు.

వెస్టిండీస్‌పై 6 సార్లు అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అశ్విన్.. ఈ విషయంలో హర్భజన్ సింగ్‌ను అధిగమించాడు.

12 వికెట్లతో, అశ్విన్ 8వ సారి టెస్ట్ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. చివరి టెస్టులోనూ అశ్విన్ 10 వికెట్లు పడగొట్టినట్లయితే.. ఈ ఘనత సాధించిన భారత నంబర్ 1 బౌలర్‌గా అవతరిస్తాడు.

131 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టడం విదేశీ గడ్డపై అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే, ఒక ఇన్నింగ్స్‌లో 71 పరుగులు ఇచ్చి.. 7 వికెట్లు పడగొట్టాడు. ఇది విదేశీ గడ్డపై అతని అత్యుత్తమ ప్రదర్శన.

Whats_app_banner