Gavaskar birthday gift for Babar: పాకిస్థాన్‌ కెప్టెన్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన గవాస్కర్‌-gavaskar birthday gift for babar as the legendary player attended the celebrations
Telugu News  /  Sports  /  Gavaskar Birthday Gift For Babar As The Legendary Player Attended The Celebrations
సునీల్ గవాస్కర్ తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
సునీల్ గవాస్కర్ తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం

Gavaskar birthday gift for Babar: పాకిస్థాన్‌ కెప్టెన్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన గవాస్కర్‌

17 October 2022, 19:26 ISTHari Prasad S
17 October 2022, 19:26 IST

Gavaskar birthday gift for Babar: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు లెజెండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌. టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న పాక్‌ టీమ్‌ను సన్నీ కలిశాడు.

Gavaskar birthday gift for Babar: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాకిస్థాన్‌ టీమ్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అక్కడే తన 28వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. గత శనివారం (అక్టోబర్‌ 15) బాబర్‌ బర్త్‌డే సందర్భంగా ఐసీసీ స్పెషల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసింది. ఇందులో వరల్డ్‌కప్‌లో ఆడుతున్న అన్ని టీమ్స్‌ కెప్టెన్లు పార్టిసిపేట్ చేశారు.

ఆ కెప్టెన్లందరితో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ తర్వాత బాబర్‌ తన బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. ఇక ఆదివారం పాకిస్థాన్‌ టీమ్‌ కూడా బాబర్‌ కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ ఆర్గనైజ్‌ చేసింది. దీనికి ఇండియన్‌ లెజెండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా అతడు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. తన ఆటోగ్రాఫ్‌ ఉన్న క్యాప్‌ను బాబర్‌కు సన్నీ ప్రెజెంట్‌ చేశాడు.

అంతేకాదు ఎన్నో విలువైన సూచనలు కూడా ఈ సందర్భంగా గవాస్కర్‌ ఇవ్వడం విశేషం. ఈ వీడియోను సోమవారం (అక్టోబర్‌ 17) పాకిస్థాన్‌ క్రికెట్‌ షేర్‌ చేసింది. సునీల్‌ గవాస్కర్‌ను బాబర్‌ ఆజం కలిశాడంటూ ఈ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. బాబర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన తర్వాత అతనితో కొన్ని బ్యాటింగ్‌ టిప్స్‌ను కూడా సన్నీ షేర్‌ చేసుకున్నాడు.

ఈ సందర్భంగా పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం టీమ్‌కు కోచ్‌లుగా ఉన్న సక్లైన్‌ ముస్తాక్‌, మహ్మద్‌ యూసుఫ్‌ కూడా పక్కనే ఉన్నారు. గవాస్కర్‌ చెప్పిన విషయాలను బాబర్‌ ఎంతో శ్రద్ధగా విన్నాడు. "షాట్‌ సెలక్షన్‌ బాగుంటే ఏ సమస్యా ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా షాట్‌ సెలక్షన్‌ చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు" అని బాబర్‌కు చెబుతూ.. పక్కనే ఉన్న బ్యాటింగ్ కోచ్‌ మహ్మద్‌ యూసుఫ్‌ వైపు గవాస్కర్‌ చూపించాడు.

ఆ తర్వాత తన ఆటోగ్రాఫ్‌ చేసిన క్యాప్‌ను బాబర్‌కు అందించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌ తన తొలి మ్యాచ్‌ను వచ్చే ఆదివారం (అక్టోబర్‌ 23) ఇండియాతోనే ఆడనుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌ కోసం టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడైపోగా.. కొత్తగా కేవలం నిల్చొనే మ్యాచ్‌ చూసేలా నాలుగు వేల టికెట్లు అమ్మడం విశేషం.