Virat Kohli Flopped Again: కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -former pakistan player criticizes virat kohli and says he flopped again ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Flopped Again: కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli Flopped Again: కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Aug 30, 2022 07:44 AM IST

Virat Kohli Flopped Again: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించాడు. అనుకున్న స్థాయిలో అతడు రాణించలేదని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‍‌లో పాక్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

<p>విరాట్ కోహ్లీ</p>
విరాట్ కోహ్లీ (AP)

Virat Kohli Flopped Again: దుబాయ్ వేదికగా ఆదివారం నాడు పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత కుదురుకుని చాలా రోజుల తర్వాత నిలకడైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 35 పరుగులు చేసిన కోహ్లీ.. అర్ధశతకం చేసేలా కనిపించాడు. కానీ మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శనపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా విమర్శలు గుప్పించాడు. కోహ్లీ మరోసారి విఫలమయ్యాడని స్పష్టం చేశాడు.

"అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ అతడు మరోసారి విఫలమయ్యాడు. ప్రారంభంలో అతడు కొంత ఇబ్బంది పడ్డాడు. కొన్ని బంతులు ఇన్‌సైడ్ ఎడ్జ్‌లు అయ్యాయి. అయితే దురదృష్టవశాత్తు అలాంటి ఇన్‌సైడ్ ఎడ్జ్ బంతికే కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌తో ఆడేటప్పుడు ఎక్స్‌ట్రా కవర్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కోహ్లీ ఔట్ అయ్యాడు. అతడు ఆ షాట్ చాలా బాగా ఆడతాడు. అయితే అతడు సచిన్‌తో కలిసి ఆడుతున్నప్పుడు ఆ షాట్ ఆడటం మానేయమని మాస్టర్ సలహా ఇచ్చాడని ఎవరో నాకు చెప్పారు. కానీ కోహ్లీ ఇప్పుడు అదే షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు." అని డానిష్ కనేరియా స్పష్టం చేశాడు.

"కోహ్లీకి పాక్‌తో మ్యాచ్‌లో అదృష్టం కలిసొచ్చిందని కనేరియా తెలిపాడు. అతడు ఎదుర్కొన్న రెండో డెలివరీలోనే కోహ్లీ ఔటయ్యేవాడు. నసీమ్ షా బౌలింగ్‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను ఫఖార్ జమాన్ పట్టుకోలేకపోయాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క మంచి షాట్ ఆడాడు. అది తప్పు అతడు పెద్దగా రాణించిందేమి లేదు." అని కనేరియా తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. దాయాది జట్టులో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ 4 వికెట్లు, హార్దిక్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనంలో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. కోహ్లీ 35 పరుగులు చేయగా.. జడేజా 35, పాండ్య 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

Whats_app_banner

సంబంధిత కథనం