England vs Sri lanka Match Highlights: సెమీస్ చేరుకున్న ఇంగ్లాండ్ - వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్
England vs Sri lanka: టీ20 వరల్డ్ కప్‌లో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ 1 నుంచి సెమీస్ బెర్త్‌ను ఇంగ్లాండ్ ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
England vs Sri lanka: వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ రాణించారు. ఈ గెలుపుతో నెట్ రన్ రేట్ ఆధారంగా ఇంగ్లాండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. ఓపెనర్ నిశాంక 67 రన్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. 142 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్నది. అలెక్స్ హేల్స్ 47 రన్స్, బెన్ స్టోక్స్ 42 రన్స్‌తో ఇంగ్లాండ్‌ను గెలిపించారు. జోస్ బట్లర్‌తోపాటు అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్ రాణించడంతో ఇంగ్లాండ్ సులువుగానే ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించింది.
కానీ చివరలో శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. కానీ పట్టుదలగా ఆడిన స్టోక్స్ ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు చేర్చాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, లాహిరు కుమారా, ధనుంజయ డిసిల్వా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆస్ట్రేలియాతో సమానంగా ఏడు పాయింట్లు సాధించింది. ఆస్ట్రేలియా రన్‌రేట్ -0.173 ఉండగా ఇంగ్లాండ్ రన్ రేట్ మాత్రం +0.473 ఉంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లాండ్ సెమీస్ చేరుకోగా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి ఔట్ అయ్యింది.