Dhoni Photo With Ground Staff: గ్రౌండ్ స్టాఫ్‌తో ధోనీ ఫొటోలు - నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు-dhoni poses for photos with ground staff after csk win in ipl final photo viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dhoni Poses For Photos With Ground Staff After Csk Win In Ipl Final Photo Viral

Dhoni Photo With Ground Staff: గ్రౌండ్ స్టాఫ్‌తో ధోనీ ఫొటోలు - నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

HT Telugu Desk HT Telugu
May 31, 2023 11:23 AM IST

Dhoni Photo With Ground Staff: ధోనీపై మ‌రోసారి నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తోన్నారు. వ్య‌క్తిత్వం, మంచిత‌నం విష‌యంలో ధోనీకి సాటి ఎవ‌రూ లేర‌ని అంటోన్నారు. అందుకు కార‌ణం ఏమిటంటే...

ధోనీ
ధోనీ

Dhoni Photo With Ground Staff: త‌న వ్య‌క్తిత్వం, మంచిత‌నంతో మ‌రోసారి నెటిజ‌న్ల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు ధోనీ. సోమ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సొంతం చేసుకున్న‌ది. ధోనీకి ఇదే చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ప్ గెలిచి చెన్నై టీమ్ అత‌డికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికింద‌ని వార్త‌లు వినిపిస్తోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

కాగా మ్యాచ్ ముగిసిన అనంత‌రం చెన్నై ఆట‌గాళ్ల‌తో క‌లిసి స్టేడియంలో ధోనీ సంద‌డి చేశాడు. అంతే కాకుండా గ్రౌండ్ స్టాఫ్ ధోనీని ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తే వారి కోరిక కూడా ధోనీ నెర‌వేర్చాడు. వారితో గ్రూప్ ఫోటో దిగ‌డ‌మే కాకుండా ఒక్కొక్క‌రితో విడివిడిగా కూడా ఫోటోల‌కు ఫోజిచ్చాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

చెన్నై ప్లేయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగితే ధోనీ మాత్రం గ్రౌండ్ స్టాఫ్‌తో ఫొటోలు దిగుతూ క‌నిపించ‌డంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అత‌డి వ్య‌క్తిత్వం, డౌన్ టూ ఎర్త్ నేచ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోన్నారు. . మంచిత‌నం, స‌హృద‌య‌త‌లో ధోనీకి ఎవ‌రూ సాటిరారంటూ నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

వారి కామెంట్స్ ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. కాగా త‌న రిటైర్ మెంట్ నిర్ణ‌యాన్ని ధోనీ వాయిదావేశాడు. మ‌రో ఆరేడు నెల‌ల త‌ర్వాతే రిటైర్‌మెంట్‌పై ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్ప‌డంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

WhatsApp channel