Dhoni on Deepak Chahar: దీపక్ చాహర్ డ్రగ్ లాంటోడు - సీఎస్‌కే పేసర్‌పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Dhoni on Deepak Chahar: దీపక్ చాహర్‌లో మెచ్యూరిటీ రావడం తాను జీవితంలో చూడలేనేమోనని ధోనీ పేర్కొన్నాడు. దీపక్ చాహర్‌ను ఉద్దేశించి ధోనీ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Dhoni on Deepak Chahar: చెన్నై పేసర్ దీపక్ చాహర్‌పై మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాహర్ ఓ డ్రగ్ లాంటి వాడని ధోనీ ఫన్నీగా పేర్కొన్నాడు. ధోనీ నిర్మిస్తోన్న ఫస్ట్ తమిళ్ మూవీ లెట్స్ గెట్ మ్యారీడ్ (ఎల్‌జీఎమ్) టీజర్ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో సోమవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు తన భార్య సాక్షితో కలిసి ధోనీ హాజరయ్యాడు.
ఈ ఈవెంట్‌లో దీపక్ చాహర్‌ను ఉద్దేశించి ధోనీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. "దీపక్ చాహర్ ఓ డ్రగ్ లాంటి వాడు. అతడు కనిపించకపోతే ఎక్కడ ఉన్నాడా వెతుకుతుంటాను. ఒకవేళ అతడు నా చుట్టూ పక్కనే ఉంటే వీడు ఇక్కడ ఎందుకున్నాడా? అని చికాకు కలుగుతుంది. అతడి వదులుకోలేను. అలాగని నాతో పాటు ఉంచుకోలేనని" ధోనీ పేర్కొన్నాడు.
లైఫ్‌లో ప్రతి ఒక్కరూ మెచ్యూర్డ్ కావడానికి టైమ్ తీసుకుంటారని, చాహర్ విషయంలో అదే జరిగిందని ధోనీ పేర్కొన్నాడు. ఆటగాడిగా, వ్యక్తిగతంగా దీపక్ చాహర్‌లో మెచ్యూరిటీ కనిపిస్తోందని ధోనీ పేర్కొన్నాడు. కానీ ఈ పరిణతి కోసం ఎక్కువ సమయం తీసుకోవడం చాహర్ విషయంలో పెద్ద సమస్యగా మారిందని ధోనీ తెలిపాడు. పూర్తి స్థాయిలో మెచ్యూర్డ్ పర్సన్‌గా దీపక్ చాహర్ మారడం నా జీవితంలో చూడలేనేమోనని ధోనీ పేర్కొన్నాడు.
దీపక్ చాహర్ గురించి ఫన్నీగా ధోనీ చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ ముగిసిన తర్వాత ధోనీని దీపక్ చాహర్ ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడు.కానీ అతడికి ఆటోగ్రాఫ్ ఇవ్వకుండా ధోనీ కొద్ది సేపు చాహర్‌ను ఆటపట్టించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్‌లో విఫలమైన దీపక్ చాహర్ కేవలం 13 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.